ఒక్కోసారి మనం చేసే ప్రయత్నాలకంటే.. ప్రత్యర్థులు చర్యలే మనకు కలిసి వస్తాయి. ప్రస్తుతం ఆ నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జికి అదే కలిసి వస్తోందా..? తమ నాయకుడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ శ్రేణులు వైసీపీ ఆఫీస్‌పై దాడి చేసి.. ఎదుటి వారికి అవకాశం ఇచ్చారా? మొన్నటి వరకు సెగ్మెంట్ అంతా కూడా తెలియనివారిని…స్టేట్ మొత్తం తెలిసేలా చేశారా?, నందమూరి బాలకృష్ణ నియోజకవర్గంలో మొన్న జరిగిన ఘటనలు ఎవరికి కలిసివచ్చాయి?. వైసిపి గ్రాఫ్ ఎలా పెంచుకోవాలని… కొన్ని…
MLA MS Raju: తెలుగుదేశం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ జోలికి వస్తే.. చర్మం ఒలిచేస్తాం అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు.. నేను బాలయ్య అభిమానిగా చెబుతున్నా అంటూ హెచ్చరించారు.. హిందూపురంలో కొందరు చిల్లర వెధవలు బాలయ్య గురించి మాట్లాడరు… దీంతో, మా వాళ్లు ఆవేశంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేశారని పేర్కొన్నారు.. అంతేకానీ, బాలయ్య జోలికి వస్తే చర్మం ఒలిచేస్తాం.. మీకు,…
Balakrishna : తన సినిమాలు సమాజానికి మెసేజ్ ఇస్తాయని హీరో బాలకృష్ణ అన్నారు. హిందూపురంలో అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. హిందూపురం మండలం కిరీకేర పంచాయతీ బసవనపల్లి ZPHS లో 64 లక్షలతో నిర్మించిన తరగతి గదుల భవనంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేయాలని మా నాన్న ఎన్టీ రామారావు చెప్పారు. ఇలాంటి భవిష్యత్తు కార్యక్రమాలకు పునాది వేసింది కూడా ఆయనే. హిందూపురంలో పరిశ్రమలు, పాఠశాలలు…
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం పర్యటనలో భాగంగా నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మొదటి రోజు సమీక్షలు, సమావేశాలతో బిజీబిజీ ఉన్నారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకొస్తా అని హామీ ఇచ్చారు. ప్రభుత్వాసుపత్రి అభివృద్ధిపై గత పాలకులు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. ఆస్పత్రిలో డాక్టర్లు, సిబ్బందిని అదనంగా ఏర్పాటు చేసి రోగులకు ఇబ్బందులేకుండా చూస్తా అని, ఆస్పత్రిలో ఉన్న పరికరాలతో పాటు మరిన్ని ఎక్విప్‌మెంట్ ఏర్పాటు చేస్తామని బాలయ్య బాబు చెప్పారు. Also…
హిందూపురం నియోజకవర్గం అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. రెండో రోజు పర్యటనలో భాగంగా.. హిందూపురం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనం ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నామంటే ఎంతోమంది త్యాగమూర్తుల ఫలితమే మనకి స్వాతంత్ర్య దినోత్సవం అన్నారు.. ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం.. అందులో పూజారిని మాత్రమే నేను అన్నారు..
అధికార పార్టీకి విపరీతమైన పట్టున ఆ నియోజకవర్గంలో వైసీపీ తప్పుల మీద తప్పులు చేస్తోందా? అధిష్టానం నిర్ణయంతో ఇప్పుడు కేడర్ డైలమాలో పడిందా? ఆగండి... రా.. రండని నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిలుస్తున్నా... పట్టించుకునే స్థితిలో ద్వితీయ శ్రేణి లేదా? ఏదా అసెంబ్లీ సెగ్మెంట్? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులేంటి?
పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేస్తే.. సస్పెన్షన్ కానుకగా ఇచ్చారని వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఏపీ ఆగ్రోస్ మాజీ చైర్మన్ నవీన్ నిచ్చల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉరి తీసేటప్పుడు కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారని, వైసీపీ అధిష్టానం తనను ఏమీ అడగలేదని మండిపడ్డారు. 15 ఏళ్లు నందమూరి బాలకృష్ణతో పోరాడి పార్టీ కోసం పని చేశానని.. తనని కాదని ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చినా పార్టీ కోసం పని చేశానన్నారు. తన సస్పెన్షన్ వెనుక…
YS Jagan suspends Hindupur ycp leaders: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో.. క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు ఇద్దరు వైసీపీ కీలక నేతలను అధిష్టానం సస్పెండ్ చేసింది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డిని పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదని అధిష్టానం హెచ్చరించింది. వైసీపీలో…
Hindupur: హిందూపురంలో మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. 23 మంది మద్దతుతో టీడీపీకి చెందిన కౌన్సిలర్ రమేష్ మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో వైసీపీ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వైసీపీ పార్టీ తన కౌన్సిలర్లకు విప్ జారీ చేసినప్పటికీ, 17 మంది మాత్రమే మద్దతు పొందడం విశేషం.ఈ ఎన్నికలో టీడీపీ నాయకత్వం కీలకంగా నిలిచింది. ముఖ్యంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సహకారంతో.రమేష్ గెలుపు సాధించారు. దీనితో వైసీపీకు మున్సిపల్ ఛైర్మన్ పగ్గాలు…