MP Gorantla Madhav: సీఎం నిర్ణయం తీసుకోలేదు.. ఎమ్మెల్యే అవుతా.. ఎంపీ అవుతానని నేను ఎలా చెబుతా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Gorantla Madhav: సీఎం వైఎస్ జగన్ ఇంకా నిర్ణయం తీసుకోనప్పుడు నేను ఎమ్మెల్యేను అవుతా.. ఎంపీని అవుతానని ఎలా చెబుతా..?ను అంటూ ఎదురు ప్రశ్నించారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సర్వే రిపోర్టుల ఆధారంగా సీఎం జగన్ టికెట్లు నిర్ణయిస్తారు.. అన్ని కులాలను గుర్తు పెట్టుకుని, అభ్యర్థి బలాలు బేరీజువేసుకుని టికెట్లు ఇస్తారని తెలిపారు. అయితే, నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయం సీఎం జగనే నిర్ణయిస్తారు.. నేనెలా చెబుతాను? అని ప్రశ్నించారు.
Read Also: Pawan Kalyan: కాకినాడపై స్పెషల్ ఫోకస్.. పవన్ కల్యాణ్ పర్యటన పొడిగింపు
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
నేను రాజకీయాల్లోనే ఉన్నా.. ఎన్నికల్లో పోటీ చేయనని ఎలా చెబుతాను? అని ప్రశ్నించారు గోరంట్ల మాధవ్.. నా విషయంలో సీఎం జగన్ నిర్ణయమే తీసుకోలేదు.. సీఎం నిర్ణయం తీసుకోనప్పుడు నేను ఎమ్మెల్యేను అవుతా.. ఎంపీని అవుతానని ఎలా చెబుతా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎవరు ఎక్కడినుంచి పోటీ చేయాలనే విషయంపై సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అయితే, నిన్న పిలిపిస్తే వచ్చా.. చిన్న పనులు ఉంటే వాటి విషయమై మాట్లాడాను.. కానీ. సీఎం జగన్ ను నేను కలవలేదన్నారు. నా సీటు విషయమై చర్చే జరగలేదు, ఇంకా క్లారిటీ రాలేదన్నారు. నిర్ణయానికి మూడు, నాలుగు రోజులు సమయం తీసుకుంటారని అనుకుంటున్నాననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు.. టికెట్ల గురించిన చర్చ జరుగలేదు.. నాకు ఎటువంటి పిలుపు రాలేదన్నారు. సామాజిక సాధికారతలో భాగంగా సీఎం జగన్ మార్పులు చేస్తున్నారని తెలిపారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.
తాజావార్తలు
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!