భగవద్గీతపై టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు ఎంఎస్ రాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ఈ దేశంలోని ప్రజలందరికీ హిందువులకు భగవద్గీత కంటే, ముస్లింలకు ఖురాన్ కంటే, క్రైస్తవులకు బైబిల్ కంటే పవిత్రమైనదని వ్యాఖ్యానించారు. “బైబిల్, భవద్గీత, ఖురాన్ వల్ల మన జీవితాలు మారలేదు, కేవలం భారత రాజ్యాంగం వల్లనే ప్రజల జీవితాలు మారిపోయాయన్నారు.…
Bhanu Prakash Reddy: భగవద్గీతపై పాలకమండలి సభ్యులు MS రాజు చేసిన వాఖ్యలపై మరో పాలకమండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. 5,125 సంవత్సరాల చరిత్ర కలిగిన భగవద్గీతను ఎంఎస్ రాజు అవహేళన చేయడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.
Bandi Sanjay: తెలంగాణలో బోనాల పండుగ సందర్భంగా బంజారాహిల్స్‌లోని పెద్దమ్మ గుడిని కూల్చడం పట్ల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రముఖ నటుడు కమల్ హాసన్ తన తాజా చిత్రం “తగ్ లైఫ్” విడుదలకు ముందు కొత్త వివాదంలో చిక్కుకున్నారు. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కన్నడిగుల ఆగ్రహానికి కారణమయ్యాయి. “మీ భాష (కన్నడ) తమిళం నుంచే పుట్టింది” అని కమల్ హాసన్ అనడం కర్ణాటకలో తీవ్ర దుమారం రేపింది. కమల్ హాసన్ తన ప్రసంగాన్ని “ఉయిరే ఉరవే తమిళే” (నా ప్రాణం, నా బంధుత్వం తమిళం) అంటూ ప్రారంభించారు. ఆ తర్వాత, వేదికపై…
ప్రముఖ తమిళ నటుడు సంతానం ప్రధాన పాత్రలో నటించిన హారర్ కామెడీ సినిమా 'డీడీ నెక్స్ట్ లెవెల్' వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా నటుడు సంతానం స్పందించాడు. "మేము ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బ తీసే విధంగా సినిమాను తీయలేదు. అలా ఉంటే కచ్చితంగా మాకు సెన్సార్ నుంచి క్లియరెన్స్ వచ్చి ఉండేది కాదు.
గోవుల మరణాలపై జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి నారా లోకేష్ ఖండించారు. "టీటీడీ గోశాలలో గోవుల మరణాలంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. దురుద్దేశపూరిత ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, వాస్తవాలను టీటీడీ స్పష్టం చేసింది. తప్పుదోవ పట్టించేందుకు, రెచ్చగొట్టేందుకు వైసీపీ పురిగొల్పుతున్న తప్పుడు కథనాలను భక్తులు నమ్మొద్దు. రాజకీయ లబ్ధికోసం పవిత్ర సంస్థలపై అసత్యాలను ప్రచారం చేయడం సిగ్గుచేటు." అని నారా లోకేష్ స్పష్టం చేశారు.
Adipurush: ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’పై పలు పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పిస్తోంది. ఆదిపురుష్ లోని కొన్ని డైలాగ్స్ అత్యంత అభ్యంతరకరంగా, తక్కువ గ్రేడ్ చిత్రాల్లోని డైలాగ్స్ లా ఉన్నాయని ఆరోపించింది. ఈ సినిమాకు బీజేపీ మద్దతు ఉందని దుయ్యబట్టింది.
కాళి అమ్మవారిని సిగరేట్ తాగుతూ చూపించడాన్ని హిందు సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో టోరంటోలోని అగాఖాన్ మ్యాజియం హిందువుల మత విశ్వాసాలను కించపరిచేందుకు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఒట్టావాలోని భారత మిషన్, కెనడాలోని అధికారులు వివాదస్పద చిత్రాన్ని తొలిగించాలని కోరడంతో ‘ కాళి’ డాక్యుమెంటరీ ప్రదర్శనను తీసివేసినట్లు తెలిపింది. టొరంటోకు చెందిన చిత్రనిర్మాత మణిమేకలై శనివారం ‘ కాళి’ డాక్యుమెంటరీ పోస్టర్ ను ట్విట్టర్ లో పంచుకోవడం వివాదాస్పదంగా మారింది. ఇందులో కాళి అవతారంలో ఉన్న…