Uddhav Sena: బీజేపీ ప్రభుత్వం మరాఠీ ప్రజలపై హిందీ రుద్దుతుందనే కారణంతో 20 ఏళ్ల విభేదాలను పక్కన పెట్టి ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు ఒక్కటయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వం హిందీని మూడో భాషగా వెనక్కి తీసుకోవాలనే నిర్ణయం తర్వాత, ఠాక్రే సోదరులు శనివారం ‘‘వాయిస్ ఆఫ్ మరాఠీ’’ పేరుతో పెద్ద ర్యాలీని నిర్వహించారు.
MK Stalin: జాతీయ విద్యా విధానంలో త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా, హిందీ భాష విధింపుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వం విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, మహారాష్ట్రలో ఈ వివాదమే 20 ఏళ్ల తర్వాత రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేలు కలిసేందుకు సాయపడింది.
Raj Thackeray: 20 ఏళ్లుగా శత్రువుగా ఉన్న బంధవులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు ఒకే వేదికను పంచుకుంటూ, తాము కలిసిపోయినట్లు ప్రకటించారు. శివసేన(యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుల కలయిక రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బాల్ ఠాక్రే కూడా చేయలేని పనిని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేశారని రాజ్ ఠాక్రే అన్నారు. వివాదాస్పద త్రిభాష సూత్రంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ,
ఒక భాషను బలవంతంగా రుద్దడం లేదా ఒక భాషను గుడ్డిగా వ్యతిరేకించడం.. రెండూ మన భారతదేశం యొక్క జాతీయ, సాంస్కృతిక ఏకీకరణ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నిన్న జనసేన సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తమిళనాడులో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పలువురు స్పందించారు. తాజాగా పవన్ వారికి ఎక్స్ వేదికగా సమాధానం చెప్పారు.
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తమిళనాడులో సంచలనంగా మారాయి. డీఎంకే, కేంద్ర ప్రభుత్వాల మధ్య ‘‘హిందీ’’ వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో నిన్న జనసేన ఆవిర్భావ సభలో ఈ విషయంపై పవన్ కామెంట్స్ తమిళనాట కాక పుట్టించాయి.
Supreme Court: గత కొంత కాలంగా జాతీయ విద్యా విధానం(NEP), ‘‘త్రి భాష విధానం’’పై కేంద్రానికి, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య తీవ్ర వివాదమే చెలరేగుతోంది. హిందీ భాషను తమ రాష్ట్రంపై బలవంతంగా రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అధికార డీఎంకే పార్టీతో పాటు ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాము ‘‘తమిళ్, ఇంగ్లీష్ ద్వి భాష విధానాన్ని’’ అమలు చేస్తామని చెబుతున్నారు.
MK Stalin: తమిళనాడు ప్రభుత్వం, డీఎంకే పార్టీ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జాతీయ విద్యా విధానంలో(ఎన్‌ఈపీ) భాగంగా తమ రాష్ట్రంపై బలవంతంగా ‘‘హిందీ’’ని రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాకుండా వచ్చే ఏడాది పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్ కసరత్తు జరుగనుండటంతో తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ స్థానాల సంఖ్య తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Hindi Row: జాతీయ విద్యా విధానం (NEP)లో భాగంగా త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడంపై తమిళనాడు ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. హిందీని తమపై బలవంతంగా రుద్దుతున్నారని తమిళనాడులోని ఎంకే స్టాలిన్ సర్కార్, అధికార డీఎంకే పార్టీ, దాని మిత్రపక్షాలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే, దీనిపై కేంద్రం విద్య మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం సీఎం స్టాలిన్‌కి లేఖ రాశారు. ‘‘ ఏ భాషను బలవంతంగా రుద్దే ప్రశ్నే లేదు,