HimachalPradesh : స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా దేశంలోని కొన్ని ప్రాంతాలకు కనీస సౌకర్యాలు లేవు. కానీ క్రమంగా మోడీ ప్రభుత్వం వారికి అన్ని సౌకర్యాలు, వసతులు కల్పిస్తోంది.
ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి జిల్లాలోని భీమకాళీ ఆలయంలో ఇవాళ (సోమవారం) ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బాలీవుడ్ నటి, మండి బీజేపీ లోక్సభ అభ్యర్థి కంగనా రనౌత్ శుక్రవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. హిమాచల్ప్రదేశ్లోని మండి నియోజకవర్గానికి కంగనా చేరుకోగానే బీజేపీ కార్యకర్తలు, నేతలు భారీ స్వాగతం పలికారు
Landslide : హోలీ పర్వదినాన హిమాచల్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ హోలా మొహల్లాలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి చెందారు. మరోవైపు మరో ఏడుగురు గాయపడ్డారు.
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఆ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఈ రోజు బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఈ రోజు బీజేపీలో చేరనున్నారు. ఇటీవల రాజ్యసభ ఎంపీల ఎన్నిక సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ తరుపున క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారు. దీంతో వారిపై అనర్హత వేటు వేశారు.
హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ విధించిన అనర్హత వేటుపై స్టే విధించేందుకు న్యాయస్థానం నిరాకరించింది.
ఇంగ్లీష్ ఆటగాళ్లు సిరీస్ ఓటమిని సైతం మరిచిపోయి ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడి వాతావరణం వారికి బాగా నచ్చినట్లుంది. హిమాచల్ ప్రదేశ్ ( Himachal Pradesh ) శీతల రాజధాని అయిన ధర్మశాల ఇంగ్లండ్ పరిస్థితులకు చాలా దగ్గరగా ఉంటుంది.
దేశంలో ఆయా రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ (Weather Alert) హెచ్చరికలు జారీ చేసింది. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది.