కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మన సంపదను ముస్లింకు పంపిణీ చేస్తామంటున్న కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుక విదేశీ హస్తం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హమీర్‌పూర్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. మన దేశానికి సంబంధించిన ఆణ్వాయుధాలను నాశనం చేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కులం, మతం పేరుతో దేశం మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ విభజించాలని చూస్తుందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
Read Also: Rohit Sharma: ఐపీఎల్‌లో రోహిత్ శర్మ చరిత్ర.. విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు!
టుక్డే-టుక్డే గ్యాంగ్ మొత్తం కాంగ్రెస్ చుట్టూ చేరి.. ఆ పార్టీ సిద్ధాంతాలను హైజాక్ చేస్తోంది అంటూ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. మీ సంపద మీతోనా ఉండలా? లేదా ముస్లింలకు వెళ్లాలా? మీరే నిర్ణయం తీసుకోండి అని సూచించారు. మేము ముస్లింకు అన్ని హక్కులు సమానంగా కల్పించాం.. కానీ, మత ప్రాతిపదికన మేము హక్కులు కల్పించలేదన్నారు. ఎందుకుంటే అవి ప్రజలందరి హక్కు కాబట్టి అని చెప్పారు. ఇక, అనురాగ్ ఠాకుర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
#WATCH | Hamirpur, Himachal Pradesh: Union Minister Anurag Thakur says, "In the Congress manifesto, along with the hand of the Congress, hands of foreign forces are also visible who want to give your children's property to Muslims, finish the nations nuclear weapons, divide the… pic.twitter.com/3dxJE6avvz
— ANI (@ANI) April 27, 2024