Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో కులులో బుధవారం మూడు ‘‘క్లౌడ్ బరస్ట్’’ చోటు చేసుకున్నాయి. దీంతో ఒక్కసారిగా మెరుపు వరదలు ఆ ప్రాంతాలను ముంచెత్తాయి. కీలక రహదారులు ఎక్కడికక్కడ స్తంభించి పోయాయి. సైన్జ్, గడ్సా, సోలాంగ్ నాలాలో కుండపోత వర్షాలు నమోదయ్యాయి. దీంతో జీవ నాలా ప్రవాహం అకస్మాత్తుగా పెరిగింది. స్థానిక ప్రజల్ని అధికారులు హెచ్చరించారు. ఆకస్మిక వరద కారణంగా నదులు మరియు వాగులు ఉప్పొంగి ప్రవహించాయి.
ఐపీఎల్ 2025లో భాగంగా మే 11న ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్ వేదిక మారింది. ధర్మశాలకు బదులు అహ్మదాబాద్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ విషయాన్ని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అనిల్ పటేల్ ధృవీకరించారు. ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో ధర్మశాల విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే. ఉత్తర భారతదేశంలోని చాలా విమానాశ్రయాలు మే 10 వరకు మూసివేయబడ్డాయి. పంజాబ్ కింగ్స్ ప్లేయర్స్ రోడ్డు మార్గంలో ఢిల్లీకి చేరుకుని, ఢిల్లీ…
పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య అన్ని రకాల సంబంధాలను తెగదెంపులు చేసుకున్నాయి. అయితే ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులు క్లియర్ గా కనిపిస్తున్నాయి. కొన్నిరోజులుగా నియంత్రణ రేఖ దగ్గర(ఎల్ఓసీ) రెండు దేశాల సైనికుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. అంతే కాకుండా.. ఇటీవల తుర్కియేకు చెందిన ఓ భారీ యుద్ధ నౌక ఇటీవల పాకిస్థాన్ కు చేరుకుంది. దీంతో భారత్, పాకిస్థాన్ యుద్ధం అంచున ఉన్నాయా.. రానున్న…
Simla Agreement: పహల్గామ్ ఉగ్రదాడి, ఇండియా-పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ -పాక్ మధ్య 1972లో ‘‘సిమ్లా ఒప్పందం’’ జరిగిన చారిత్రాత్మక టేబుల్‌పై ‘‘పాకిస్తాన్ జెండా’’ కనిపించకుండా పోయింది. భారత్, పాక్‌తో సంబంధాలను నిలిపేసిన ఒక రోజు తర్వాత ఈ విషయం జరిగింది. మంగళవారం, పహల్గామ్‌లో 26 మంది అమాయకపు టూరిస్టులను లష్కరే తోయిబా అనుబంధ ఉగ్ర సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ కిరాతకంగా చంపేసింది.
Kangana Ranaut: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పాలిటిక్స్ హీటెక్కాయి. భారతీయ జనతా పార్టీ ఎంపీ కంగనా రనౌత్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటుంది. తాజాగా తన ఇంటికి లక్ష రూపాయల కరెంట్ బిల్లు వచ్చిందంటూ అరిచి గోల చేసింది.
Kangana Ranaut: కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఆ పార్టీ బ్రిటిష్ వలసవాద వారసత్వం, గతంలో జరిగిన ఉగ్రవాద చర్యలకు ఆ పార్టీ భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్‌కు పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయి.. ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో దేశంలో ఆశాంతి, భయానక వాతావరణం ఉండేదని తెలిపింది.
హిమాచల్‌ప్రదేశ్‌లో ఆకస్మాత్తుగా ఏర్పడిన వాతావరణ మార్పులతో ఒక్కసారిగా భీకరమైన ఈదురుగాలులు ఏర్పడ్డాయి. దీంతో భారీ వృక్షాలు నేలకూలిపోయియి. అంతేకాకుండా కొండల మీద నుంచి పెద్ద పెద్ద బండరాయలు దొర్లుకుంటూ వచ్చి కార్లపై పడ్డాయి. దీంతో అనేక వాహనాలు దెబ్బతిన్నాయి.
Himachal: నిధుల లేమితో ఇబ్బందులు పడుతున్న హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. రాష్ట్ర సంక్షేమ పథకాల కోసం ఆలయ ట్రస్టుల నుంచి నిధులు కోరుతోందని ఆరోపించింది. అయితే, దీనిపై ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు మాట్లాడుతూ, ఈ విరాళం స్వచ్ఛందంగా అందించబడిందని, ఇది సుఖ్ ఆశ్రయ్ పథకం కింద అనాథలకు భవన నిర్మాణ సౌకర్యాల కోసం అని చెప్పారు.
Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో గత మూడు రోజులుగా వాతావరణం ఉగ్రరూపం దాల్చింది. గత 12 గంటలుగా కుండపోత వర్షాలు, భారీ హిమపాతం రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. రాష్ట్రంలోని ఎత్తైన ప్రాంతాల్లో మంచు కురుస్తుండగా, లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మరోవైపు లాహౌల్ స్పీతి, చంబా-పాంగీ, కిన్నౌర్ జిల్లాల్లో కురుస్తున్న భారీ మంచు కారణంగా రహదారులు మూసివేయబడ్డాయి. దీంతో ఈ ప్రాంతాలు మిగతా ప్రపంచంతో సంబంధాన్ని కోల్పోయాయి. గత 24 గంటల్లో లాహౌల్ స్పీతి, కిన్నౌర్, చంబా, కాంగ్రా,…
ఉత్తర భారత్‌లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఆకాశం మేఘావృతమై ఉంది. దీంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.