Himachal Floods: అకస్మాత్తుగా క్లౌడ్ బరస్ట్.. ముగ్గురు మృతి.. కొట్టుకుపోయిన వాహనాలు
- హిమాచల్‌ప్రదేశ్‌లో అకస్మాత్తుగా క్లౌడ్ బరస్ట్
- ముగ్గురు మృతి.. కొట్టుకుపోయిన వాహనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిమాచల్‌ప్రదేశ్‌ను వరదలు వెంటాడుతున్నాయి. ఇటీవల భారీ వరదలు కారణంగా రాష్ట్రం తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంది. తేరుకునేలోపే మరోసారి జలఖడ్గం విరుచుకుపడింది. మంగళవారం తెల్లవారుజామున మండిలో ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్ జరిగింది. కుండపోతగా కురిసిన వర్షంతో మండి అతలాకుతలం అయింది. ఇళ్లు నీట మునిగాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. ఇక ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు వదిలారు. ఇళ్లల్లోకి నీరు చేరడంతో బతుకుజీవుడా అంటూ స్థానికుల సాయంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
- Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
Debris piled up to the first floor in parts of Mandi city. Locals seen rescuing people stuck inside buildings. Heartbreaking visuals, but the spirit of unity stands strong. Prayers for everyone’s safety. 🙏 #Mandi pic.twitter.com/yvyjFfjsMa
— Nikhil saini (@iNikhilsaini) July 29, 2025
मंडी जेल रोड के पास भारी बारिश के कारण भारी नुकसान , नाले में आए पानी के साथ मलबे से पूरा रोड बंद हो गया है और गाड़ियां फस गई है साथ ही कई गाड़ियां को नुकसान हुआ है ये बादल फटने जैसा ही है l
सभी सुरक्षित रहें !#Mandi #HimachalPradesh pic.twitter.com/HXaXJGEduH— Gems of Himachal (@GemsHimachal) July 29, 2025
అందరూ నిద్రలో ఉన్నారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్ జరిగింది. నిద్రలోంచి తేరుకునేలోపే అకస్మాత్తుగా వరదలు ముంచుకొచ్చాయి. మంగళవారం తెల్లవారుజామున సంభవించిన ప్రకృతి విధ్వంసంతో మండి జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. రహదారులు మూసుకుపోయాయి. ఇళ్లల్లోకి నీరు ప్రవేశించింది. అంతా అంధకారం.. ఏం చేయాలో తెలియక ప్రజలు బెంబేలెత్తిపోయారు. కళ్లు తెరిచి చూసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వాహనాలు, వస్తువులు వరదల్లో కొట్టుకుపోయాయి.
ఇది కూడా చదవండి: Gold Rates: పెళ్లిళ్ల సీజన్ వేళ.. దిగొచ్చిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?
ప్రస్తుతం జిల్లా యంత్రాంగం, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఉన్న వారిని వెతికి తీస్తున్నారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని అధికారులు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Haryana: కన్వరియాలు ఘాతుకం.. కక్షతో జవాన్ కాల్చివేత.. 4రోజుల క్రితమే భార్య ప్రసవం
ఇక ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ఒక ప్రకటన విడుదల చేశారు. తాను వ్యక్తిగతంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సహాయ చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కొండచరియలు విరిగిపడటంతో కిరాత్‌పూర్-మనాలి నాలుగు లేన్ల జాతీయ రహదారులు, పఠాన్‌కోట్-మండి జాతీయ రహదారులు మూసివేశారు. ఇక హిమాచల్ ప్రదేశ్ వరదలు కారణంగా మరణాల సంఖ్య 164కి చేరుకుంది. జూన్ 20 నుంచి రాష్ట్రం రూ.1,523 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూసిందని రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రం అంచనా వేసింది.
తాజావార్తలు
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!