హిమాచల్‌ప్రదేశ్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. ఇద్దరు మృతి చెందగా.. 20 మంది గాయపడ్డారు. కాంగ్రా జిల్లాలోని మునుని ఖాడ్‌లో ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇందిరా ప్రియదర్శిని జల విద్యుత్ ప్రాజెక్ట్ స్థలం సమీపంలోని లేబర్ కాలనీలో ఉన్ 15-20 మంది కార్మికులు గల్లంతైనట్లుగా సమాచారం. ప్రాజెక్ట్ దగ్గర నీటి మట్టం పెరగడంతో కొట్టుకుపోయి ఉంటారని తెలుస్తోంది. వారి కోసం అధికారులు గాలిస్తున్నారు. బియాస్, సట్లెజ్ నదుల నీటి మట్టం పెరిగిందని అధికారులు చెప్పారు.
ఇది కూడా చదవండి: Anupama : చేతిలో అరడజను సినిమాలు.. అయోమయంలో అనుపమ
వర్షాలు కారణంగా ప్రాజెక్ట్ పనులు నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. తాత్కాలిక ఆశ్రయాల్లో విశ్రాంతి తీసుకుంటుండగా హఠాత్తుగా వరద రావడంతో కార్మికులు కొట్టుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. కొంత మంది క్షేమంగా బయటపడినట్లు సమాచారం. ఈ ఘటనలో దాదాపు 20 మంది కార్మికులు గల్లంతయ్యారని ధర్మశాల బీజేపీ ఎమ్మెల్యే సుధీర్ శర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాష్ట్ర విపత్తు దళం, స్థానిక అధికారులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: Mancherial: సంతూర్ సబ్బుల లారీ బోల్తా.. సబ్బులను ఎత్తుకెళ్లడానికి ఎగబడ్డ జనం..!
కులు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఇళ్లు, పాఠశాల భవనం, దుకాణాలు, రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నట్లుగా అధికారులు తెలిపారు. క్లౌడ్‌బర్ట్స్ కారణంగానే ఇంత పెద్ద ఎత్తున వరదలు సంభవించినట్లుగా తెలుస్తోంది.
చంబా, కాంగ్రా, మండి, సిమ్లా, సిర్మౌర్ జిల్లాల్లో గురువారం సాయంత్రం వరకు వరద ప్రమాదం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక జూన్ 29 వరకు రాబోయే నాలుగు రోజుల్లో నాలుగు నుంచి ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది.
VIDEO | Himachal Pradesh: Car washed away, three missing as cloudbursts trigger flash floods in Kullu district.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/zGf52cQw7e
— Press Trust of India (@PTI_News) June 25, 2025