ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ ఎపిసోడ్ రోజుకో మలుపులు తిరుగుతోంది. నర్సీపట్నంలో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఇంటి దగ్గర గోడ కూల్చివేత ఘటనలో హైడ్రామా చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. రాత్రి పూట కూల్చివేతలపై కోర్టు వ్యాఖ్యలకు సీఎం జగన్ ఏం సమాధానం చెపుతారు? అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. తప్పు చేసిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అయ్యన్నది కబ్జా కాదు.. ఇడుపులపాయలో వైఎస్ కుటుంబం చేసింది కబ్జా. ఇడుపులపాయలో వైఎస్ కుటుంబం 600 ఎకరాల దళితుల…
ఏపీలో ఉప ఎన్నిక మాటున నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. సీపీఐ అగ్రనేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో జగన్ పోటీచేయాలన్నారు నారాయణ. 900 రోజులుగా రైతులు, మహిళలు ఉద్యమాలు చేస్తున్నా జగన్ ప్రభుత్వం కిరాతకంగా వ్యవహరిస్తోంది. న్యాయస్థానాలు సానుకూలంగా స్పందిస్తున్నా ముఖ్యమంత్రి వితండ వాదన చేస్తుండడం దారుణంగా వుందన్నారు. ఆనాడు అమరావతిలో రాజధానిని అంగీకరించారు. ప్రతిపక్షనేతగా ముందు అంగీకరించి ఇప్పుడు ఆడినమాట తప్పుతారా..? మోడీ కాళ్లు మోక్కినంత మాత్రాన జైలుకు పోకుండా ఎవరైనా ఆపగలరా..?ఆత్మకూరులో…