రాయలసీమ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో జగన్ ముందున్నారన్నారు ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి. ప్రజలలో హై కోర్టు పెట్టాలని కోరిక చూసి ఆశ్చర్యపోతున్నాం. రాయలసీమ ప్రజల ఆకాంక్ష మేరకు వైఎస్ జగన్ నెరవేర్చారు…వికేంద్రీకరణను అందరు హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. చంద్రబాబు కర్నూలులో వచ్చి రాజధాని కావాలా అని హేళన చేశారు. రాయలసీమకు న్యాయం చేస్తాం అంటే వీళ్ళు అడ్డుపడుతున్నారు… తన మనుషులతో కోర్టులో కేసులు వేసి కర్నూలుకు హై కోర్టు రాకుండా చేయాలనీ చూస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.
Read ALso: MLAs Poaching Case : ఎమ్మెల్యే ల కొనుగోలు కేసులో హైకోర్టులో విచారణ ప్రారంభం
రాయలసీమ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. దేవుడు లాంటి రాజశేఖర్ రెడ్డి రాయలసీమలో నీటి ప్రాజెక్టులు చేపట్టారు….అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలని కోరితే టీడీపీ నేతలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అమరావతిని, అని ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేస్తాం. కావాలనే ఈ సభ దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజల కోరికను చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారు. రాయలసీమ అభివృద్ధి ఎవరు అడ్డుకుంటున్నారో అందరికీ తెలుసు. ప్రాంతాల మధ్య విబేధాలు రాకూడదనే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారన్నారు శ్రీకాంత్ రెడ్డి. రానున్న రోజుల్లో మరింత పోరాటాలు చేసి మా హక్కులను సాధించుకుంటాం అన్నారాయన.
Read Also: Warangal: పదినెలల చిన్నారి ప్రాణం తీసిన కొబ్బరిముక్క