గణేష్ చతుర్థి సందర్భంగా నగరంలో భారీ గణనాథులను ఏర్పాటుచేశారు. మూడో రోజు నుంచి గణపతుల నిమర్జన కార్యక్రమం జరగాల్సి ఉన్నది. ఈరోజున నిమర్జనం కావాల్సిన విగ్రహాలు కొన్ని ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకుంటున్నాయి. అయితే, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమర్జనం చేసేందుకు హైకోర్టు అనుమతులు నిరాకరించిన సంగతి తెలిసిందే. పర్యావరణానికి హాని కలుగుతుందని, హుస్సేన్ సాగర్‌లో నిమర్జనం చేసేందుకు వీలు లేదని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం హౌస్…
అక్రమ సంతానం విషయంలో కర్ణాటక హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఈ ప్రపంచంలో అక్రమ తల్లిదండ్రులు ఉంటారేమోగాని, అక్రమ సంతానం ఉండదని పేర్కొన్నది. తమ పుట్టుకలో పిల్లల పాత్ర ఏమీ ఉండదని కోర్టు పేర్కొన్నది. బెంగళూరు ప్రభుత్వ విద్యుత్ రంగ సంస్థ బెస్కాంలో గ్రెడ్ 2 లైన్‌మెన్‌గా పనిచేస్తున్న వ్యక్తి మరణించడంతో ఆ ఉద్యోగాన్ని ఇవ్వాలని ఆయన రెండో భార్య కుమారుడు బెస్కాంకు విజ్ఞప్తి చేయగా, బెస్కాం తిరస్కరించింది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి…
ఇటీవల పశ్చిమ బెంగాల్‌కు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నది. ఎన్నికల తరువాత రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనలకు ప్రధానకారణం ప్రభుత్వమే అని, మమత సర్కార్ అండదండలతో తృణమూల్ గూండాలు రెచ్చిపోతున్నారని గతంలో ప్రతిపక్షస్థానంలో ఉన్న బీజేపీ ఆరోపించింది. Read: ఎన్టీఆర్, రామ్ చరణ్ చిత్రాలకు అతడే సంగీత దర్శకుడు! బెంగాల్ గవర్నకు ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై గవర్నర్…
ఆనందయ్య తయారు చేసిన మందు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఆనందయ్య మందు కరోనాకు పని చేస్తుందని వార్తలు రావడంతో ఒక్కసారిగా ఆయన మందుకు డిమాండ్ పెరిగింది. ఇక ఈ మందుపై ప్రస్తుతం విజయవాడ ఆయుర్వేద పరిశోధనసంస్థ, తిరుపతి ఎస్వీ ఆయుర్వేద కళాశాల పరిశోధన చేస్తున్నాయి. 570 మంది నుంచి వివరాలు సేకరించి పరిశోధన చేశారు. ఈ నివేదికను సీసీఆర్ఏఎస్‌కు సమర్పించారు. సీసీఆర్ఏఎస్ నుంచి అనుమతులు వస్తే ఆనందయ్య మందు తయారు…
ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ ఎన్నికలను నిర్వహించారు. ఎన్నికలను నిర్వహించిన తరువాత ఫలితాలను ఇవ్వకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఈరోజు కీలక తీర్పును వెలువరించింది. గతంలో నిర్వహించిన పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. సుప్రీం కోర్టు సూచించిన నిబంధనల ప్రకారం ఎన్నికలు జరగలేదని ఏపీ హైకోర్టు తీర్పులో పేర్కొన్నది. హైకోర్టు తీర్పుపై ఏపి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో…
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య రోజుకు 50కి పైగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. మే 8 వ తేదీతో కర్ఫ్యూ సమయం పూర్తవుతుంది. అయితే, ఈరోజు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ సమయం పొడిగించాలని ఆదేశించింది. వీకెండ్ లాక్ డౌన్ పై ఎందుకు నిర్ణయం తీసుకోవాలని, ఈనెల…