ఏపీ ప్రభుత్వం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోలు వెబ్‌సైట్‌లో ఎందుకు అప్‌లోడ్ చేయడం లేదని కోర్టు ప్రశ్నించింది. జీవోల్లో ఐదు శాతమే సైట్‌లో ఉంచుతున్నారని న్యాయవాది బాలాజీ తెలిపారు. కాగా ఇది సమాచార హక్కు చట్టానికి వ్యతిరేకమని ఆయన కోర్టుకు తెలిపారు. అయితే కొన్ని రహస్య జీవోలే అప్‌లోడ్ చేయడం లేదని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాగా అన్ని జీవోల వివరాలను వెంటనే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని…
కామారెడ్డి జిల్లా శాంతాపూర్ లో రైతు భూమ్ బోయి మరణంపై హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు జారీచేసింది. పేకాట శిబిరంపై దాడి చేశారు బిచ్కుంద పోలీసులు. అక్కడే పొలంలో వడ్లకు కాపలా ఉన్న రైతు భూమ్ బోయిని చావ బాదారు పోలీసులు. గత నెల 11న భూమ్ బోయి చికిత్స పొందుతూ చనిపోయారు. పోలీసుల కొట్టడం వల్లే చనిపోయాడని ఆరోపిస్తున్నారు భూమ్ బోయి కుటుంబ సభ్యులు.భూమ్ బోయికి సంబంధించిన మెడికల్ రిపోర్టులు, పోస్టుమార్టం…
తెలంగాణలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు మంత్రి తలసానితో భేటీ అయ్యారు సినీ ప్రముఖులు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో ఎస్ ఎస్ రాజమౌళి, దిల్ రాజు, డివివి దానయ్య, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు మరికొందరు సినీ ప్రముఖులు సమావేశం నిర్వహిస్తున్నారు. సినిమారంగ సమస్యలు, టిక్కెట్ ధరల పెంపు, కరోనా మూడో దశ నేపథ్యంలో మళ్లీ థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య తగ్గింపుపై జరుగుతున్న ప్రచారంపై చర్చించనున్నారు. అంతేకాకుండా సినిమా షూటింగ్‌లు ఎలా…
తీవ్ర ఉత్కంఠ మధ్య కృష్ణా జిల్లా కొండపల్లి మునిసిపల్ ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. చేయి ఎత్తి ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి చెన్నుబోయిన చిట్టిబాబుకు టీడీపీ కౌన్సిలర్లు మద్దతు ఇచ్చారు. వైసీపీ అభ్యర్థి జోగి రాముకు వైసీపీ కౌన్సిలర్ల మద్దతు లభించింది. టీడీపీ వైస్ ఛైర్ పర్సన్ అభ్యర్థులు లక్ష్మీ, శ్రీనివాస్ కు టీడీపీ కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. ఎక్స్ అఫిషీయో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకున్నారు టీడీపీ ఎంపీ…
తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశించిన సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామాపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నేడు హైకోర్టు లో సిద్దిపేట మాజీ కలెక్టర్ రాజీనామాపై విచారణ జరగనుంది. వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ పిల్ దాఖలు చేశారు. రీసెర్చ్ స్కాలర్ ఆర్.సుబేందర్ సింగ్, జె.శంకర్ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారించనుంది. ఐఏఎస్ రాజీనామాను ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐఏఎస్ లు కేంద్ర ప్రభుత్వం…
తెలంగాణలో సంచలనం సృష్టించిన మరియమ్మ లాక్ అప్ డెత్ కేసుపై తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. దీనిపై ఇప్పుడే తీర్పు చెప్పలేమని కోర్టు తెలిపింది. యాదాద్రి జిల్లా అడ్డగుడూరు పోలీసు స్టేషన్ పరిధిలో జూన్ నెలలో మృతి చెందిన మరియమ్మ ఈ ఘటన తో రాష్ర్టం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దీంతో వివిధ సంఘా ల ఆధ్వర్యంలో ప్రభుత్వవైఖరిని ప్రశ్నించారు. దీంతో ప్రభు త్వం బాధితురాలుకు న్యాయం చేకురుస్తామని హామీ ఇచ్చింది. కాగా ఈ కేసులను…
ఏపీలో హాట్ టాపిక్ అవుతున్న మూడురాజధానుల అంశం కీలక మలుపు తీసుకుంది. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని న్యాయస్ధానానికి అడ్వకేట్ జనరల్ తెలిపారు. మూడు రాజధానులు బిల్లు అంశంపై ఏపీ హైకోర్టులో గత కొద్దిరోజులుగా విచారణ జరుగుతోంది. నేటి వాదోపవాదాల్లో భాగంగా మూడు రాజధానుల బిల్లు ఉపసంహటించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు అడ్వకేట్ జనరల్. ఇదే అంశంపై ఏపీ సచివాలయంలో అత్యవసర కేబినెట్ సమావేశం జరుగుతోంది. మూడు…
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. ఎన్నిక నిర్వహణకు కార్పొరేషన్ యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. నగరపాలక సంస్ధ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు జరుగనుంది ఎన్నిక. మెజారిటీ కార్పోరేటర్లు అవిశ్వాసం మేరకు మేయర్, డిప్యూటీ మేయర్ లను తొలగిస్తూ ఈనెల 12న తీర్మానం చేశారు. ఈమేరకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదేశాల మేరకు నేడు మేయర్,…