దక్షిణాఫ్రికాలో దారుణం చోటు చేసుకుంది. ఓ నైట్ క్లబ్ లో దాదాపుగా 20 మంది యంగ్ ఏజ్ యువకులు చనిపోయి పడి ఉన్నారు. ఈ వార్త దక్షిణాఫ్రికాలో సంచలన కలిగించింది. దక్షిణాఫ్రికాలోని దక్షిణ ప్రాంతంలోని ఈస్ట్ లండన్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నైట్ క్లబ్ లో పార్టీ చేసుకుంటున్న సందర్భంలో యువకులు మరణించినట్లు తెలుస్తోంది. చనిపోయినవారి అందరి వయసు 18-20 మధ్యే ఉందని అక్కడి పోలీస్ అధికారులు వెల్లడించారు. ఈస్టర్న్ కేప్ అథారిటీ ప్రతినిధి…