ఒమిక్రాన్ వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు బయటకు రావడానికే భయపడుతుంటే.. ఎగ్జిబిషన్ కావాలా? అంటూ హైకోర్టు ప్రశ్నించింది. 2019 నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో అగ్నిప్రమాదంపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. నాటి ఘటనను దృష్టిలో ఉంచుకొని.. ఎగ్జిబిషన్ నిర్వహణకు ఫైర్, జీహెచ్ఎంసీ అనుమతి తీసుకోవాలని జీవో ఇచ్చామని ప్రభుత్వం తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు. దాంతో వివిధ విభాగాల అనుమతి తీసుకోవాలన్న ఉత్తర్వులు అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇంతటితో 2019 అగ్నిప్రమాదంపై విచారణ ముగిసినట్టు కాదని తెలిపింది.…
కరోనా సమయంలో ఆయుర్వేద మెడిసిన్‌తో వార్తల్లో నిలిచిన నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య.. ఒమిక్రాన్ టెన్షన్ పెడుతోన్న సమయంలో.. తాను ఒమిక్రాన్‌ను కూడా మందు తయారు చేశానని ప్రకటించారు.. దీంతో.. ఆయన నివాసం ఉండే కృష్ణపట్నానికి పక్క రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలివచ్చారు.. అయితే, అక్కడే ఆనందయ్యకు ఊహించని షాక్ తగిలింది… ఓవైపు ఆనందయ్య మందు పంపిణీకి అనుమతి ఇవ్వొద్దంటూ కృష్ణపట్నం పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేయగా… అసలు, నీ మందుకు ఉన్న అనుమతి ఏంటి?…
తాగి వాహనం నడిపితే పబ్‌లదే బాధ్యత అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది తెలంగాణ హైకోర్టు.. ఇళ్ల మధ్య పబ్‌ల ఏర్పాటుపై దాఖలైన పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ జరిపిన హైకోర్టు.. తదుపరి విచారణను జనవరి 6వ తేదీకి వాయిదా వేసింది.. అయితే, పబ్‌లో నిర్వాహకులకు పలు కీలక సూచనలు చేసింది హైకోర్టు.. పబ్‌ల ముందు ఖచ్చితంగా హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేయాలని.. తాగి వాహనాలను నడపవద్దు అంటూ హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు ఉల్లంఘించిన వారిని…
ఓవైపు ఉద్యోగుల బదీలీల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర చర్చకు దారి తీస్తుంది. దీనిపై ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దీనిపై హైకోర్టుకు వచ్చిన అప్పీళ్లపై స్పందించింది.కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపు వివాదాలపై హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. వివిధ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయుల పిటిషన్లపై విచారించిన హైకోర్టు దీనిపై ఉత్తర్వులు ఇస్తూ ప్రభుత్వానికి సూచనలు చేసింది. ఉపాధ్యాయుల అప్పీళ్లను ప్రభుత్వానికి పంపించాలని డీఈఓలకు హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. అప్పీళ్లను సమర్పించిన…
ఏపీలో ప్రస్తుతం సినిమా టికెట్ల ధర, సినిమా థియేటర్ల తనిఖీలు హాట్ టాపిక్‌గా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సినిమా థియేటర్లలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. సినిమా టికెట్ ధరలు అధికంగా అమ్మినా, సినిమా థియేటర్లకు సంబంధించి ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకపోయినా సీజ్ చేస్తున్నారు. అయితే గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50కిపైగా థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. కొన్ని సినిమా థియేటర్ల యాజమాన్యాలు స్వచ్ఛందంగా సినిమా థియేటర్లను మూసివేశాయి. అయితే…
కరోనా రాకతో అందరి జీవితాలు వర్చువల్ అయిపోయాయి. స్కూల్స్ , ఆఫీసులు , అన్ని కార్యాలయాల పనులు వర్చువల్ గానే జరుగుతున్నాయి .. అదే అండీ జూమ్ యాప్ లో.. వీడియో కాల్స్ ద్వారా జరుగుతున్నాయి. ఇక ఈ వర్చువల్ మీటింగ్స్ లో ఇంటి దగ్గర ఉండి ఎవరి పనులు వారు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కొన్ని చోట్ల అపశృతులు దొర్లాయి. గతేడాది వర్చువల్ కాన్ఫిరెన్స్ లో ఒక ఎమ్మెల్యే నగ్నంగా దర్సనమిచ్చిన సంగతి తెలిసిందే..…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రంపంచదేశాలను వణికిస్తోంది.. భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మహమ్మారి.. తెలంగాణలోనూ వెలుగు చూసింది.. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి తెలంగాణలో అడుగుపెట్టిన ఒమిక్రాన్ ఇప్పుడు టెన్షన్ పెడుతోంది.. క్రమంగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరుగుతూ పోతున్నాయి.. ఓవైపు డెల్టా వేరియంట్ కేసులు పూర్తిస్థాయిలో తగ్గిపోకముందే.. ఇప్పుడు ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తోంది.. అయితే, ఒమిక్రాన్ కట్టడికి క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ…
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలపై మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర హైకోర్టు.. ఈ కేసులో సింగిల్ బెంచ్ తీర్పును ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసిన విషయం తెలిసిందే కాగా.. ఇవాళ మరోసారి ఈ కేసులో విచారణ చేపట్టింది ధర్మాసనం.. ఇక, టికెట్ల ధరల నియంత్రణపై జీవో నంబర్ 35 రద్దు అందరికీ వర్తిస్తుందన్నారు అడిషనల్ జనరల్.. కాగా, గత విచారణలో పిటిషనర్లకే జీవో నుంచి మినహాయింపు వస్తుందని హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ…
ఏపీలో సినిమా టిక్కెట్ల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. రేపు ‘పుష్ప’ సినిమా విడుదల నేపథ్యంలో టిక్కెట్ల రేట్ల విషయంలో గందరగోళం నెలకొంది. గతంలో ఉన్న కమిటీలో లోటు పాట్లను సరిచేసి కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు చేసిన విషయం తెలిసిందే. టిక్కెట్ల ధరల జాబితాను జాయింట్ కలెక్టర్‌కు పంపించాలని థియేటర్ యజమానులకు కూడా హైకోర్టు సూచించింది. టిక్కెట్ల ధరలకు అనుగుణంగా పన్నులు చెల్లించాలని కూడా హితవు పలికింది.…
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల వ్యవహారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారిపోయింది.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇచ్చిన జీవోను హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ కొట్టివేయడంతో.. ఇది మరింత చర్చకు దారితీసింది. సింగిల్ బెంచ్ తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను సంప్రదించిన సంగతి తెలిసిందే కాగా… ఇవాళ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. సినిమా టికెట్ల ధరలపై ఇవాళ మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు.. గతంలో ఉన్న కమిటీలో లోటు పాట్లను సరి చేసి…