కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఆయన హైకోర్టుకు నివేదిక సమర్పించారు. రాష్ర్టంలో కరోనా పరిస్థితులపై, తీసుకుంటున్న చర్యలపై ఆయన కోర్టుకు వివరించారు. కోవిడ్, ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేస్తున్నామని కోర్టుకు తెలిపారు. కాగా ఇప్పటికే రాష్ర్టప్రభుత్వం దీనిపై సమీక్ష కూడా నిర్వహించిందని తెలిపారు.
Read Also:ఈ సమయంలో నుమాయిష్ కావాలా..? హైకోర్టు
ప్రస్తుత పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉన్నామని ఒక వేళ ఒమిక్రాన్ వేరియంట్ వచ్చినా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం ఇప్పటికే అన్నిఆస్పత్రుల్లో అన్ని ఏర్పాట్లు చేసిందని వివరించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆక్సిజన్ బెడ్స్‌ను కూడా ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచామని ఆయన వెల్లడించారు. మరోవైపు ప్రజలు కూడా స్వీయ నియంత్రణ చర్యలు పాటిస్తూ మహమ్మారి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలనిహెల్త్ డైరెక్టర్ కోరారు.