టాలీవుడ్ డ్రగ్స్ కేసులో బుధవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. డ్రగ్స్ కేసులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 2017లో దాఖలు చేసిన పిల్‌పై ఈరోజు హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈడీకి సహకరించడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది రచనరెడ్డి పేర్కొంది. కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్న కేసులో రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సరిగా లేదన్నారు. ఆన్‌లైన్ విచారణలో నేరుగా కోర్టుకు ఈడీ జేడీ అభిషేక్ గోయెల్ వివరించారు. ఈడీ…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చింతామణి నాటాకాన్ని నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయంపై భిన్నవాధనలు వినిపిస్తున్నాయి.. ఈ వ్యవహారం కోర్టు మెట్లుఎక్కిన విషజ్ఞం తెలిసిందే కాగా.. చింతామణి నాటకం నిషేధంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఒక పాత్ర బాగోకపోతే మొత్తం నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు.. చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయంపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ స్పందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.. నాటకంలో ఒక పాత్ర బాగోకపోతే…
న్యాయమూర్తులపై అనుచిత పోస్టుల కేసు విచారణ సందర్భంగా సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. భారతదేశంలోని చట్టాలు న్యాయస్థానాలను గౌరవించకపోతే వ్యాపారం మూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.. ట్విట్టర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదని అభిప్రాయపడింది ఏపీ హైకోర్టు. ట్విట్టర్‌లో పోస్టులు డిలీట్ చేసినా.. విపిన్ అని టైప్ చేస్తే వెంటనే ఆ పోస్టులు వస్తున్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు హైకోర్టు న్యాయవాది అశ్వినీ కుమార్.. దీనిపై సీరియస్ అయిన హైకోర్టు..…
పీఆర్సీ అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపింది హైకోర్టు.. ప్రభుత్వ తరపు న్యాయవాది శ్రీరామ్ వాదనలు వనిపించారు.. ఈ పిటిషన్ డివిజన్ బెంచ్ ముందు విచారించాలని, ఇది సింగిల్ బెంచ్ కాబట్టి.. ఇక్కడ విచారించకూడదని హైకోర్టుకు తెలిపారు.. ఆయన వాదనతో ఏకీభవించిన ధర్మాసనం రిట్ పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదుపరి చర్యలు తీసుకోవడానికి పంపాలని రిజిస్టర్‌ను ఆదేశించింది. పిటిషన్లు మళ్లీ సీజే బెంచ్‌కి బదిలీ…
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. సమ్మక్క-సారక్క జాతర ఏర్పాట్లపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారాంతపు సంతల్లో కోవిడ్ జాగ్రత్తలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అటు ఈనెల 31 నుంచి పాఠశాలలు తెరుస్తారా అని హైకోర్టు ఆరా తీసింది. పాఠశాలల పున:ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. పాఠశాలల ప్రారంభంపై వివరాలు తెలపాలని హైకోర్టు ఆదేశించింది. Read Also: తెలంగాణలో భూములకు కొత్త మార్కెట్…
రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. రాష్ట్రంలో పాజిటివిటి రేటు 3.16 శాతంగా ఉందని, ప్రస్తుతం రాత్రి కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదని అన్నారు. పాజిటివిటి 10 శాతం దాటితే రాత్రి కర్ఫ్యూ వంటివి అవసరం అవుతాయని అన్నారు. గత వారం రోజుల వ్యవధిలో ఒక్క జిల్లాలో కూడా పాజిటివిటీ రేటు 10 శాతం దాటలేదని, మెదక్‌లో అత్యధికంగా 6.45 శాతం,…
పీఆర్సీపై ఏపీలో పెను దుమారం లేస్తోంది. ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్ధం చేసుకోవాలని అధికార వైసీపీ నేతలు అంటుంటే.. ఇలాంటి పీఆర్సీని చరిత్రలో చూడలేదంటూ ఉద్యోగులువాపోతున్నారు. 11వ పీఆర్సీని రద్దు చేయాలని, తమ సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని సవాల్ చేస్తూ ఉద్యోగ సంఘాలు హై కోర్టు ను ఆశ్రయించారు. ఈ క్రమంలో పీఆర్సీ జీవోలు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై నేడు ఏపీ…
పీజీ వైద్య కాలేజీల్లో 2017-2020కి ఫీజుల పెంపు పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ప్రైవేటు వైద్య కాలేజీల్లో 2017-2020కి ఫీజులు పెంచుతూ 2017 మే 9న జీవోలు జారీ చేశారు. దీనిపై కొందరు విద్యార్థులు టీఏఎఫ్ఆర్ సీ సిఫార్సు లేకుండా ప్రభుత్వం ఫీజులు పెంచిందంటూ పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో పిటిషన్ విచారించిన హైకోర్టు పీజీ వైద్య ఫీజుల పెంపుపై సీజే ధర్మాసనం తీర్పు వెల్లడించింది. 2016-19కి టీఏఎఫ్ఆర్ సీ ఖరారు చేసిన ఫీజులే తీసుకోవాలన్న హైకోర్టు స్పష్టం చేసింది.…
కరోనా కేసుల విజృంభణ మళ్లీ కొనసాగుతుండడంతో.. అంతా ఆన్‌లైన్ బాట పడుతున్నారు.. ఇప్పటికే ఈ నెల 30వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులు పొడిగించిన నేపథ్యంలో.. ప్రైవేట్ విద్యా సంస్థలు ఇవాళ్టి నుంచే ఆన్‌లైన్ బోధనను తిరిగి ప్రారంభించాయి.. మరోవైపు.. న్యాయస్థానాల విధుల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ హైకోర్టు.. రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో వెంటనే అన్ని కేసులను ప్రత్యక్ష విచారణ నిలిపివేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది..…