బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సామాజిక న్యాయం దిశగా చారిత్రాత్మక నిర్ణయంగా భావిస్తున్న ఈ వ్యవహారంలో ఏ మాత్రం నిర్లక్ష్యం జరగకుండా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు.
Kaleshwaram Commission : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకొని చర్యలు తీసుకోవద్దని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు వచ్చే నెల 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా హైకోర్టు ఇప్పటికే ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టకూడదని కేసీఆర్, హరీశ్…
Congress Meeting: తెలంగాణ కాంగ్రెస్‌లో నేడు ( అక్టోబర్ 7న) కీలక పరిణామాలు చోటు చేసుకోనుంది. ముఖ్యంగా, బీసీ నేతల అత్యవసర సమావేశం ఈరోజు సాయంత్రం 4:00 గంటలకు జరగనుంది. రేపు ( అక్టోబర్ 8న) హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు విచారణకు రానుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై న్యాయస్థానాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 ప్రకారం, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల్లో ఏకంగా 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు కేటాయించింది.
దేశ ప్రజలంతా దసరా ఉత్సవాలకు రెడీ అవుతున్నారు. దసరా రోజున రావణాసురుడి, సూర్పణక దహనాలు నిర్వహిస్తుంటారు. అయితే ఈసారి మేఘాలయ హనీమూన్ మర్డర్ నిందితురాలు సోనమ్ రఘువంశీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు రెడీ అయ్యింది ఓ సామాజిక సంస్థ. దసరా రోజున ‘సుర్పణక దహనం’ కోసం 11 తలల దిష్టిబొమ్మను సిద్ధం చేస్తున్నట్లు ఇండోర్‌కు చెందిన సామాజిక సంస్థ ‘పౌరుష్’ తెలిపింది. సోనమ్‌తో పాటు భర్తలను, పిల్లలను, అత్తమామలను దారుణంగా హత్య చేసిన నిందితులైన మహిళల చిత్రాలు…
తెలంగాణ గ్రూప్ 1 వివాదంలో కీలక మలుపు చోటుచేసుకుంది. కొన్ని రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు గ్రూప్-1 పిటిషన్లను కొట్టివేసి సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. మెయిన్స్ పరీక్ష పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. రీవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని ఆదేశించింది. సాధ్యంకాకపోతే పరీక్షలు మళ్లీ నిర్వహించాలని పేర్కొంటూ మెయిన్స్ మెరిట్ లిస్ట్ ను హైకోర్టు రద్దు చేసింది. దీంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో…
తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, గ్రూప్-1 పరీక్షల్లో జరిగిన అక్రమాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును ప్రభుత్వానికి చెంపపెట్టుగా అభివర్ణించిన ఆయన, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో తప్పులు జరిగాయని కోర్టు నమ్మినట్లు తెలిపారు.
గ్రూప్-1 పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గ్రూప్-1 పిటిషన్లను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు.. మెయిన్స్ పరీక్ష పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని టీజీపీఎస్సీకి ఆదేశం.. రీవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని TGPSCకి ఆదేశం.. సాధ్యంకాకపోతే పరీక్షలు మళ్లీ నిర్వహించాలన్న హైకోర్టు.. మెయిన్స్ మెరిట్ లిస్ట్ ను హైకోర్టు రద్దు చేసింది. Also Read:Allu Shock : అల్లు అరవింద్ కు GHMC షాక్.. కూల్చేస్తాం.. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పరీక్షలు రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు…
తెలంగాణలో గ్రూప్ 1 అంశంపై తెలంగాణ హైకోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. గ్రూప్ 1 అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పరీక్షలు రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2023 అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 21 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆ పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ ఈ ఏడాది మార్చి 10న విడుదల చేసింది. ఈ ఫలితాల్లో అభ్యర్థులకు వచ్చిన…
ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.. పదేళ్లుగా ఒక హత్య కేసులో స్టే ఎలా పొడిగిస్తున్నారని ప్రశ్నించింది న్యాయస్థానం.. ఇకపై వాయిదాలు వేయలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది..