కుటుంబ వివాదం కేసులో లక్నో హైకోర్టు బెంచ్ కీలక నిర్ణయం తీసుకుంది. భార్య బాగా సంపాదిస్తే, ఆమె భర్త నుంచి భరణం పొందలేరని కోర్టు స్పష్టంగా చెప్పింది. భర్త ప్రతి నెలా భార్యకు భరణం కోసం రూ. 15,000 చెల్లించాలని కుటుంబ కోర్టు ఆదేశించిన ఉత్తర్వును హైకోర్టు లక్నో బెంచ్ కొట్టివేసింది. భర్త సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, నెలకు రూ. 1.75 లక్షలు సంపాదిస్తాడు. భార్య కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, నెలకు రూ. 73 వేల జీతం పొందుతుంది.…
Ramesh Babu : వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుకు సంబంధించి ఓటర్ల జాబితా నుండి పేరును తొలగించేందుకు ఎన్నికల అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు వేములవాడ రెవెన్యూ డివిజన్ కార్యాలయం గురువారం అధికారిక నోటీసు జారీ చేసింది. నోటీసును ఆయన నివాసమైన వేములవాడలోని ఇంటి గోడపై అతికించారు. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌గా బాధ్యత వహిస్తున్న రెవెన్యూ డివిజనల్ అధికారి జారీ చేసిన నోటీసులో, రమేశ్‌బాబు భారతీయ పౌరుడు కాదని, ఆయనకు జర్మన్ పౌరసత్వం ఉందని…
బెట్టింగ్ యాప్ కేసులో నేడు పంజాగుట్ట పోలీసుల ముందుకు నటి విష్ణు ప్రియ మరోసారి రానుంది. ఈనెల 25న విచారణకు హాజరు కావాలంటూ గతంలోనే పంజాగుట్ట పోలీసులు చెప్పారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. హైకోర్టులో విష్ణుప్రియకు చుక్కెదురైంది. విచారణకు సహకరించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇవాళ పంజాగుట్ట పోలీసుల ముందుకు విచారణకు విష్ణు ప్రియ హాజరుకానుంది.
సీఆర్‌జెడ్ ఉల్లంఘనలు వ్యవహారంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబానికి మరో షాక్ తగిలింది. భీమిలి బీచ్‌లో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన అక్రమ కట్టడాలను జీవీఎంసీ పూర్తిగా తొలగిస్తోంది. ఇక్కడ నేహారెడ్డికి చెందిన భూమిలో భారీ భవన నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఇసుక తిన్నెలు మీద భారీగా గుంతలు తవ్వి స్ట్రాంగ్ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు. సముద్ర తీరాన్ని ఆనుకుని చేపట్టిన భవనం అక్రమ నిర్మాణాలుగా నిర్ధారణ కావడంతో కూల్చి వేయాలని హైకోర్టు ఆదేశించింది.
తిరుపతి తొక్కిసలాటపై సీబీఐ విచారణకు ఆదేశించాలని దాఖలైన పిల్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఈ సంఘటనపై ఇప్పటికే ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించిందని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు.
Nalgonda: బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్‌లో రైతు మహా ధర్నా జరగనుంది. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. అలాగే మాజీ మంత్రి గుంటకంట్ల జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర బీఆర్‌ఎస్ నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఈనెల 12న నిర్వహించాల్సిన ఈ మహాధర్నాను సంక్రాంతి పండుగ కారణంగా వాయిదా వేసి 21న నిర్వహించేందుకు నిర్ణయించారు. కానీ, ఆ రోజుకు అనుమతి నిరాకరించిన పోలీసులు,…
తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ ఇబ్బందుల్లో పడ్డారు. ఆయనను ఏపీ క్యాడర్‌కు పంపాల్సిందేనని హైకోర్టులో ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో సీఎస్ సోమేష్ కుమార్ కొనసాగింపును హైకోర్టు రద్దు చేసింది. సీఎస్ సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది.