Thangalan: విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా నటించిన భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'తంగలాన్' ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించింది. చియాన్ విక్రమ్ కెరీర్‌లో26 కోట్ల రూపాయల బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ అందుకుంది. కొత్త మూవీస్ రిలీజ్ అవుతున్నా 'తంగలాన్' సినిమా సెకండ్ వీక్‌లో తమిళనాడు, ఏపీ, తెలంగాణ అంతటా స్ట్రాంగ్ హోల్డ్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.
ప్రతిభ ఉండాలే కానీ, పట్టం కట్టడానికి చిత్రసీమ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఎన్నో మార్లు రుజువయింది. విక్రమ్ విషయంలోనూ అదే జరిగిందని చెప్పవచ్చు. చిత్రసీమలో రాణించాలని విక్రమ్ చిన్నతనం నుంచీ కలలు కన్నారు. సినిమాల్లో తనకు లభించిన ప్రతి పాత్రకు న్యాయం చేయాలని తపించారు. తమిళ చిత్రాలలోనే కాదు కొన్ని తెలుగు సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో నటించారు. ఏదీ తగిన గుర్తింపు సంపాదించి పెట్టలేకపోయింది. ఇక నటనకు గుడ్ బై చెప్పి వేరే బాట పట్టాలనే…
ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘పొన్నియన్ సెల్వన్’. విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ డేట్ ని ప్రకటించింది. పలు భాగాలుగా రిలీజ్ కానున్న ఈ సినిమా మొదటి భాగం ఈ ఏడాది సెప్టెంబర్ 30 న రిలీజ్ కానున్నట్లు తెలిపారు. ఈ రిలీజ్…
ప్రపంచాన్ని గజగజలాడించిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుందని సంతోషపడేలోపు ఒమిక్రాన్ మళ్లీ ప్రజల మీదకు విరుచుకుపడుతోంది. ఇక ఈ వేరియంట్ భయంతో ఉన్న ప్రజలకు పలువురు ప్రముఖులు కరోనా బారిన పడడం భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇటీవల స్టార్ హీరో కమల్ హాసన్ కోవిడ్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా మరో స్టార్ హీరో విక్రమ్ కరోనా బారిన పడ్డారు. గత రెండు రోజులుగా హై ఫీవర్ తో భాదపడుతున్న విక్రమ్ కోవిడ్ పరీక్షలు…