Chiyan Vikram: ఆరోగ్యంపై విక్రమ్ వీడియో సందేశం.. ఏమన్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన తమిళ స్టార్ హీరో విక్రమ్డిశ్చార్జ్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఓ వీడియో సందేశం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు నటుడు విక్రమ్ స్వయంగా చెప్పారు. తనపై ప్రేమ, అభిమానం చూపించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అభిమానుల ప్రేమకు ఉప్పొంగిపోయానని ఆయన అన్నారు. ఇంతమంది ప్రేమ కనబరచడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అయితే ఈ వీడియోపై స్పందిస్తున్న అభిమానులు ఆయన కోలుకోవడం ఆనందంగా ఉందంటూ పోస్ట్‌ల మీద పోస్ట్‌లు పెడుతున్నారు. పూర్తిగా కోలుకునే వరకు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత షూటింగ్స్‌లో పాల్గొనాలని సూచిస్తున్నారు.
విక్రమ్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు శుక్రవారం మధ్యాహ్నం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయనకు గుండెపోటు వచ్చిందని, పరిస్థితి విషమంగా ఉందని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని విక్రమ్ సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. వార్లల్లో వచ్చిన సమాచారమంతా ఫేక్ అంటూ విక్రమ్ మేనేజర్ కొట్టిపారేసారు. అనంతరం విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ కూడా తన తండ్రి ఆరోగ్యంపై స్పందించారు. ఆయనకు ఏమి కాలేదని.. ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు. అలానే ఇదే విషయాన్ని విక్రమ్ చేరిన చెన్నైలోని కావేరి ఆస్పత్రి వైద్యులు కూడా అలాగే స్పష్టం చేశారు. ఛాతిలో అసౌకర్యంగా ఉన్నందునే ఆయన హాస్పిటల్‌కు వచ్చారని చెబుతూ శుక్రవారం సాయంత్రం మెడికల్ బులెటిన్ విడుదల చేశారు. విక్రమ్‌ను పరీక్షించి, అవసరమైన చికిత్స చేస్తున్నారని వివరించారు. మరోవైపు… విక్రమ్ ఆస్పత్రిలో చేరారన్న వార్త తెలుసుకుని ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ప్రస్తుతం ఆయన ‘కోబ్రా’, ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాల్లో నటిస్తున్నారు. ‘కోబ్రా’ ఆడియో లాంచ్ కోసం వేచి చూడాలంటూ అభిమానులను ఉద్దేశించి ఆయన వెల్లడించారు.
Also Read
- Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
- Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
- RaviTeja - VivekAthreya : రవితేజ 'తులాభారం'లో తూగబోయే నటీనటులు వీరేనట
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
https://twitter.com/mathanotnmcvf/status/1545804375289114625
తాజావార్తలు
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!