అమరావతి : ఏపీకి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ఈ నెల 9 మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి పశ్చిమ బంగాళాఖాతం దగ్గరలో ఉత్తర తమిళ్ నాడు, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతం మీద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 9వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటుని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు.
దీని ప్రభావంతో గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు ఉత్తర కోస్తా ఆంధ్ర, రాయలసీమ లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా మారడంతో కోస్తా తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.