ఏపీకి భారీ వర్ష సూచన.. ఆజిల్లాల్లో అతి భారీ వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా వుండాలని సూచించింది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడగా, ఈ నెల 9న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తం కొనసాగుతోందని, ఈ నెల 9 నాటికి అది అల్పపీడనంగా మారనుందని వివరించింది. క్రమేపీ అది బలపడి వాయువ్య దిశగా పయనిస్తుందని, దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడులోనూ, దక్షిణ కోస్తాంధ్రలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
ఈ నెల 11, 12 తేదీల్లో దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా మారడంతో కోస్తా తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ నెల 9, 10వ తేదీల్లో తమిళనాడులోనూ… 10, 11, 12 తేదీల్లో దక్షిణ కోస్తాంధ్రలోనూ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ నెల 9 లోపు తీరప్రాంతాలకు చేరుకోవాలని స్పష్టం చేసింది.
Also Read
తాజావార్తలు
-
Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
-
Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
-
Raghava Lawrence: సూర్య, విక్రమ్లకే సాధ్యం కాని సాహసం.. లారెన్స్ చేతులెత్తేస్తాడా? లేక చరిత్ర తిరగరాస్తాడా?
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో షీ టీమ్స్ ఫుల్ ఫోకస్.. 1,100 కేసులు.!
-
Rahul Gandhi: ఇందిరా ఓడిపోయింది, బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదు.
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!