తీరం దాటిన వాయుగుండం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైన్నైకి ఆగ్నేయంగా కేంద్రీకృతమైన వాయుగుండం ప్రభావంతో తమిళనాడు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురి శాయి. బంగాళఖాతంలో గంటకు 18.కీ.మీ వేగంతో కదులుతున్న వాయుగుండం. పుదుచ్చేరి చైన్నై మధ్య తీరం దాటిందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. మత్స్య కారులు వేటకు వెళ్లొద్దని అధి కారులు సూచించారు. దీనిప్రభావంతో తమిళనాడు, ప్రకాశం చిత్తూరు, నెల్లూరు, కడప తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురస్తాయని ఐఎండీ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
చిత్తూరుకు తప్పని వరద ప్రభావం..
ఇప్పటికే భారీ వర్షాల కారణంగా పలు గ్రామాలు, కాలనీలు వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్నాయి. అధికారులు సహాయ చర్యలు చేపడుతున్నారు. తిరుపతిలో ఎప్పుడు లేనంత భీకరంగా వర్షం దంచి కొడుతుంది. ఇవాళకూడా తిరుపతి కాలినడక మార్గాలు మూసివేశారు. చిగురువాడ-కేసీపేట మధ్య కూలిన స్వర్ణముఖి బ్రిడ్జి దీంతో వరద పోటెత్తుతుంది. భారీ వర్షాలు వరదలతో జలవిలయంతో వైకుంఠ క్యూలైన్లలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. శ్రీవారి మాడవిధులు చెరువులను తలపించాయి. కళ్యాణి డ్యామ్ 3గేట్లు తెరవడంతో స్వర్ణ ముఖి నది భీభత్సం. ఘాట్‌రోడ్‌లో 13 చోట్ల కొండ చరియలు విరిగి పడటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయపడు తున్నా రు.
Also Read
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
భారీ వర్షానికి ఏరాయి ఎప్పుడు విరిగిపడుతుందో తెలియని పరిస్థి తులు నెలకొన్నాయి. రాయలవారి కాలంలో అనేక గుంటలు తవ్విం చారు. ఇప్పుడు వీటిపై నిర్మాణాలు చేపట్టడంతో ఆయా కాలువల నుం చి వచ్చే వరదనీరు రోడ్ల పైకి చేరుతుంది. నారాయణ గిరి గెస్ట్‌హౌజ్‌లో కి భారీగా వరదనీరు వచ్చి చేరింది. ఈనీటిలో రాళ్లుకూడా కొట్టుకు వచ్చాయంటే వరద ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు . కడప, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ అధికారులు. అలి పిరి, శ్రీవారి మార్గం. కపిల తీర్థం వద్ద పొంగిపోర్లుతున్న వరద దీంతో లోతట్టు ప్రాంతాలన్ని నీట మునుగుతున్నాయి. టీటీడి కంప్యూటర్ రూంలోకి వరదనీరు చేరడంతో సర్వర్లను ఆపివేశారు. టీటీడీ కార్యాలయానికి సెలవు ప్రకటించిన టీటీడి.
గడచిన 50 ఏళ్లలో ఇంతటి వర్షాన్ని ఎప్పుడు చూడలేదని స్థానికులు అంటున్నారు. చిత్తూరు వ్యాప్తంగా పొంగిపోర్లుతున్న వాగులు వంకలు, ప్రమాదంలో మరికొన్ని కాలనీలు వరద నీరు పోటెత్తడంతో బుగ్గ వంక 4 గేట్లను ఎత్తి నీటిని వదిలిన అధికారులు. మదనపల్లిలో పొంగి పోర్లు తున్న బహుదా కాలువ. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. పశువులు సైతం వరదనీటిలో కొట్టుకుపోవడంతో ఏం చేయలేని పరిస్థితుల్లో స్థానికులున్నారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!