అల్ప పీడన ప్రభావంతో కడప జిల్లాలో భారీగా కురుస్తున్నవర్షాలకు జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. ఈ ఉదయం నుంచి వర్షాలు కురుస్తుండటంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. వర్షం ధాటికి కడప నగరంలోని అనేక ప్రాంతాలు మళ్ళీ జలమయమయ్యాయి. కడప కార్పొరేషన్ పరిధిలోని ఎన్జీవో కాలనీ, బాలాజీ నగర్, ఆర్టీసీ బస్టాండ్, అప్సరా సర్కిల్, శంకరాపురం, కోఆప్ రేటివ్ కాలనీ ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్ష ప్రభావం రెండు రోజులు ఉంటుందన్న వాతావరణ శాఖ సూచనలతో ముందస్తుగా జిల్లావిద్యాశాఖ సోమవారం అన్ని…
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇప్పటికే 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించిన సర్కార్, ప్రజలను అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక చెన్నైని వర్షాలు ముంచెత్తున్నాయి. చలి, వర్షాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. Read: దేశంలో చమురుధరలు దిగిరాబోతున్నాయా? ఇన్ని రోజులుగా, ఈ స్థాయిలో వర్షాలు కురవడం ఇప్పటి వరకు చూడలేదని, భారీ వర్షాలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని…
అండమాన్‌తీరంలో అల్పపీడనం ఏర్పడడంతో తమిళనాడులో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ఇప్పటికే భారీ నుంచి అతిభారీ వర్షాలతో చెన్నై నగరం తడిసిముద్దయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొన్ని చోట్ల పాత భవనాలు దెబ్బతిని కూప్పకూలిపోతున్నాయి. విద్యాసంస్థలకు కూడా సెలవు ప్రకటించారు. డిసెంబర్ 1వరకు మత్య్సకారులు వేటకు వెళ్లొదంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారు. సీఎం ఎంకే స్టాలిన్ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
ఏపీని వర్షాలు వదలనంటున్నాయి. మొన్నటి వరకు కురిసిన వర్షాలతోనే ఏపీలో వాగులు, వంకలు నిండి పొంగిపొర్లుతున్నాయి. చెరువులకు గండ్లు పడి గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. అయితే తాజాగా అండమాన్‌లో అల్పపీడనం ఏర్పడడంతో మరోసారి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షా పడుతోంది. అయితే వెంకటగిరి, కోవూరు నియోజకవర్గంలో రాత్రి నుంచి మోస్తరుగా, సూళ్లూరుపేట, సర్వేపల్లి నియోజకవర్గాలలో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి.…
భారీ వర్షాలు ఏపీకి తీరని నష్టాన్ని మిగిల్చాయి. భారీ వర్షాలతో కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోవడంతో చెయ్యేరు నదికి వరద పోటెత్తింది. దీంతో అన్నమయ్య ప్రాజెక్టు కింద ఉన్న 12 గ్రామాలు దెబ్బతిన్నాయి. కొన్ని గ్రామాలైతే ఇక్కడ ఊర్లు ఉండేవి అనేంతా కొట్టుకుపోయాయి. ఇళ్లు, వాకిలి, పశువులు కొట్టుకుపోవడంతో అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ వరద బీభత్సవానికి పలు గ్రామాలు వరద నీటిలోనే ఉన్నాయి. అయితే ఈ వరదల్లో 39 మంది…
అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం కలిగిస్తున్నాయి. హిందూపురం కొట్నూరు చెరువు మరువ వద్ద తృటిలో తప్పింది పెను ప్రమాదం.నీటిలో చిక్కుకుపోయింది తూముకుంట గార్మెంట్స్ కు వెళ్లే ప్రైవేటు బస్సు. నీటి ప్రవాహం భారీగా ఉన్నా రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు డ్రైవర్. బస్సులో దాదాపు 30 మంది మహిళలు వున్నారు. స్థానికుల సహాయంతో బయటపడ్డారు కార్మికులు. భారీ నీటి ప్రవాహం వున్నప్పుడు బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా వుండాలని స్థానికులు సూచిస్తున్నారు. ప్రమాదం నుంచి బయటపడడంతో మహిళా…
భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలమైంది. మునెపెన్నడూ చూడని విధంగా ఏపీలో వరదలు పోటెత్తాయి. వరద ప్రభావంతో గ్రామాలు జలదిగ్బంధంలో ఇరుకున్నాయి. లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వేలాదిగా పశువులు వరదల్లో కొట్టుకుపోయాయి. చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కడప జిల్లాల్లోని ప్రజలు భారీ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తిరుపతిలో కనివిని ఎరుగని రీతిలో భారీ వర్షాలు సంభవించాయి. అయితే సీఎం జగన్…
ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ మరియు దాని పరిసర ప్రాంతాల మీద ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3 . 1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. దక్షిణ అంతర్గత కర్ణాటక మరియు దాని పరిసర ప్రాంతాల మీద సగటు సముద్ర మట్టానికి 5 .8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీన పడింది. వీటి ఫలితం…
భారీవర్షాలు బీభత్సం కలిగిస్తున్నాయి. కపిల తీర్థం వద్ద వరద నీరు కలకలం రేపుతోంది. తిరుమల కొండపై నుంచినీటి ప్రవాహం కొనసాగుతుండడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. జలపాతం నుంచి భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. నీటి ప్రవాహం ధాటికి కూలిపోయింది పురాతన మంటపం. గడిచిన మూడు రోజులుగా కూలుతూ వస్తున్న మంటపం, గత రాత్రి మరింతగా కూలిపోయింది. దీంతో కపిలతీర్థంలోకి ఎవరినీ అనుమతించడం లేదు టీటీడీ అధికారులు. కపిలతీర్థం శేషాద్రికొండ దిగువన, ఏడుకొండలకు వెళ్ళే దారిలో ఉంది. దీనినే చక్రతీర్థం…