తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నారు. ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డులు, పలు కాలనీలు, వంతెనలపై నీరు చేరింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రయాణించేందుకు జంకుతున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు దంచికొడుతుండటంతో.. చాలా ప్రాంతాల్లో పరిస్థితి ఊరు.. ఏరు ఏకమైందా అన్నట్టు.. పలు చోట్లు వర్షాలు, వరదల కారణంగా ఎంతోమంది పేదలు నానా అవస్థలు పడుతున్నారు. అయితే.. ములుగు జిల్లాలో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమై పలు గ్రామాలకు రాకపోకలు…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తున్నప్పటికీ, విద్యుత్ ప్రసారానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ అంతరాయం ఉండదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కుండపోతగా కురుస్తున్న వర్షాలతో విద్యుత్ శాఖ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బుధవారం విద్యుత్ సౌధలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. వందేండ్లలో ఎన్నడూ పడనంత వర్షపాతం నమోదు అయినప్పటికి కనురెప్ప పాటు అంతరాయం లేకుండా సరఫరా అందించిన ఘనత తెలంగాణా విద్యుత్ సంస్థలకే దక్కిందని…
తెలంగాణ వ్యాప్తంగా గత ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వానలకు జనజీవనం అతలాకుతలం అయింది. వానలకు నదులు, వంకలు, చెరువలు, ప్రాజెక్టులు వరద నీటితో పారుతున్నాయి. ఇక నగరంలో ఇవాళ బలమైన ఈదురుగాలులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ఎక్కువ తీవ్రతతో బలమైన గాలులు వీస్తాయని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేసారు. ప్రయాణికులు, పాదచారులు చెట్ల కింద ఉండొద్దని నగర వాసులకు సూచించారు. ప్రయాణికులు, వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నగరంలో అత్యవసరమైతేనే…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలకు మరో మూడు రోజుల పాటు సెలవులు పొడిగించింది. కాగా.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. గత సోమవారం నుంచి నేటి వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే, వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో, మరో మూడు రోజుల పాటు సెలవులను పొడిగించారు. బుధవారాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. read also: Thank You…
సీజన్ మొదలైన జూన్ 1వ తేదీ నుంచి జులై 12 వరకు ఉమ్మడి వరంగల్ పరిధిలోని నాలుగు జిల్లాల్లో ఏకంగా వంద శాతానికి పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ములుగు జిల్లాలో 272.7 శాతం వర్షపాతం కురిసింది. ఇక భూపాలపల్లిలో 153, మహబూబాబాద్‌లో 147, జనగామలో 109, వరంగల్‌లో 95 , హనుమకొండలో 88 శాతం వర్షపాతం నమోదైనట్టు తేలింది. వరంగల్ నగరానికి వరద ముప్పు పొంచి ఉండటంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్తగా ఎన్టీఆర్ఎఫ్ బలగాలు…
నిజామాబాద్ జిల్లాలో వర్షం కుండపోతగా కురుస్తోంది. మెండోరాలో రికార్డ్ స్థాయిలో 21 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఐదో రోజు కూడా ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో.. చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. 10 వేల ఎకరాల్లోని పంటలు పూర్తిగా నీటమునిగాయి. జనజీవనం అతలాకుతలం అవ్వడంతో పాటు రాకపోకలు కూడా స్థంభించిపోయాయి. మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. తెలంగాణ – మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాదు.. కప్పుల వాగు కారణంగా భీంగల్- సిరికొండ మధ్య,…