తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలకు మరో మూడు రోజుల పాటు సెలవులు పొడిగించింది. కాగా.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. గత సోమవారం నుంచి నేటి వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే, వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో, మరో మూడు రోజుల పాటు సెలవులను పొడిగించారు. బుధవారాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది.
read also: Thank You Movie: చైతూ చెప్పిన డైలాగ్ లన్నీ సామ్ గురించేనా..?
అయితే.. బుధవారంతో సెలవులు ముగుస్తున్నాయి. ఈనేపథ్యంలో.. రాష్ట్రంలో వర్షాలు ఏ మాత్రం తగ్గలేదు, దీంతో అన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కాగా.. మరో మూడు రోజులు విద్యాసంస్థలకు సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అంటే.. గురు, శుక్ర, శనివారాల్లో కూడా విద్యాసంస్థలు బంద్ కానున్నాయి. మళ్లీ తిరిగి వచ్చే సోమవారం విద్యాసంస్థలు పున:ప్రారంభం కానున్నాయి. కాగా.. మరో వైపు రేపటి నుంచి ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. విస్తారంగా వర్షాలు కురవడంతో రేపు, ఎల్లుండి జరగాల్సిన అగ్రికల్చర్ పరీక్షలు వాయిదా వేసినట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. అయితే..ఇంజనీరింగ్ పరీక్షలు మాత్రం యథాతథం జరుగుతాయని ప్రకటించింది.
Facebook: ఫేస్‌బుక్ పేరుతో షాప్.. రూ.50వేలు జరిమానా విధించిన కోర్టు