MLA Seethakka: కూలిపోయే వంతెన దాటి.. బాధితులకు అండగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నారు. ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డులు, పలు కాలనీలు, వంతెనలపై నీరు చేరింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రయాణించేందుకు జంకుతున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు దంచికొడుతుండటంతో.. చాలా ప్రాంతాల్లో పరిస్థితి ఊరు.. ఏరు ఏకమైందా అన్నట్టు.. పలు చోట్లు వర్షాలు, వరదల కారణంగా ఎంతోమంది పేదలు నానా అవస్థలు పడుతున్నారు. అయితే.. ములుగు జిల్లాలో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమై పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అయితే.. కొన్ని చోట్ల వున్న వంతెనలు కూలిపోయే దుస్ధితికి చేరడంతో.. గిరిజనులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వానలకు కురుస్తుండటంతో.. బయటకు వెళ్లే పరిస్థితి లేక చెప్పలేని తిప్పలు పడుతున్నారు. అయితే.. వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ములుగు ఎమ్మెల్యే సీతక్క ధైర్యం చెప్పారు. బాధితులకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
read also: Tirumala: తిరుమలలో యూపీఐ ద్వారా చెల్లింపులు షురూ
Also Read
అంతేకాదు.. కూలిపోయే దశలో ఉన్న కొండాయి బ్రిడ్జిని దాటి, అవతలి గ్రామాలకు వెళ్లారు. వానలకు దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి.. బాధితులకు ధైర్యం చెప్పారు. వానలకు ఇళ్లు ధ్వంసం అయిన వారికి సాయం చేసి, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. వర్షాలు తగ్గేవరకు బయటకు రావొద్దని.. ఎలాంటి సాయం కావాలన్నా తనను, స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించారు. వానలకు పలు గ్రామాల్లో అనేక ఇళ్లు దెబ్బతిన్నాయని.. స్థానిక నాయకులు ఎమ్మెల్యే సీతక్క దృష్టికి తీసుకువచ్చి, బాధితులను ఆదుకోవాలని కోరారు. ఈనేపథ్యంలో పలుఇళ్లు కూలేందుకు సిద్దంగా వుండటంతో వారికి సాయం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా.. బాధితులకు సాయం అందేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే సీతక్క చెప్పారు.
తాజావార్తలు
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?