Heavy Rains: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి.. గత మూడు రోజులగా కొన్ని జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి.. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలకు సమీపంలో కొనసాగుతుండగా.. దాని ప్రభావంతో ఈ రోజు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.. ఈ రోజు కోస్తాతో పాటుగా రాయలసీమ, ఉత్తరాంధ్రలోని పలు జిల్లాలకు అలర్ట్ చేసింది వాతావారణశాఖ.. ముఖ్యంగా కృష్ణా, బాపట్ల, ప్రకాశం, ఏలూరు, పార్వతీపురం మన్యం, పశ్చిమగోదావరి, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.
Read Also: Black Grapes : నల్లని ద్రాక్షాలను తింటున్నారా? ఇవి తప్పక తెలుసుకోవాలి..
ఇక, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, నెల్లూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణశాఖ.. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని అంచనా వేస్తున్నారు.. మరోవైపు తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి.. ఈ రోజు, రేపు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది వాతావరణశాఖ. కాగా, ఈ సారి అనుకున్న స్థాయిలో వర్షాలు కురవలేదు.. కృష్ణా బేసిన్‌లోని నదులు, ప్రాజెక్టులకు ఇంకా అనుకున్నస్థాయిలో నీరు చేరకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.