CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలపై దుబాయ్ నుంచి అధికారులతో మరోమారు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, సీఎస్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడారు.. వర్ష ప్రభావిత నెల్లూరు, ప్రకాశం, కడప, తిరుపతి, అన్నమయ్య జిల్లాల పరిస్థితిపై ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్టీజీఎస్ అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున, మిగతా వర్ష ప్రబావిత జిల్లాలకు రూ.1 కోటి చొప్పున…
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురవబోతున్నాయి.. వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా.. ఉత్తర కోస్తా మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.. ఇది సముద్ర మట్టం నుంచి 4.5 కిలోమీటర్లు ఎత్తు లో ఆవరించి ఉందని.. దీని ప్రభావంతో రాగల ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది విశాఖపట్నం వాతావరణం కేంద్రం..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎడతెగని రీతిలో భారీ వర్షం పడుతోంది. పలు చోట్ల పంట పొలాల్లో నీరు నిలిచింది. విజయవాడలో ఉదయం నుంచి కంటిన్యూస్‌గా వర్షం కురుస్తుండడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. వీటి ప్రభావం వల్ల మరో మూడు రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తరాంధ్ర సహా.. దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలోనూ అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, రేపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.. దీని ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.. ఈ సమయంలో ఉత్తర కోస్తా వెంబడి గంటకు 50 నుంచి 60 కిలో మీటర్లు వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది..
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు, మన్యం., ఏలూరు జిల్లాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో మరికొన్ని రోజులు మోస్తరు వానలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చ రికల కేంద్రం వెల్లడించింది. ఇక, దక్షిణ ఝార్ఖండ్ మీద అల్పపీడనం బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతోంది.
Telangana Rains : రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీతో పాటు తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు ఏపీకి చెందిన ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కురిసే అవకాశముంది. Pawan Kalyan: ప్రధాని మోడీ ఓట్లు కోసం చూడరు.. దేశ అభివృద్ధి కోసమే యోచిస్తారు! అంతేకాకుండా,…
పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. అయితే, ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొది.. విశాఖ పోర్టులో మూడో నెంబర్ సాధారణ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంగా.. మూడు రోజుల పాటు.. అంటే గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు వాతావరణశాఖ అధికారులు..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం వైపు దూసుకొస్తుంది. ఇది బుధవారమే తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. రాబోయే 24 గంటల్లో వాయవ్య దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్లనుంది. తర్వాత కోస్తా తీరం వెంబడి కదలనుంది. దీని ప్రభావంతో శుక్రవారం వరకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాక (ఐఎండీ) పేర్కొంది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా తీవ్ర అల్పపీడనంగా మారింది.. ఇది, ఆంధ్రప్రదేశ్‌కు ముప్పుగా మారుతోంది. తమిళనాడు తీరానికి చేరువగా వచ్చి దిశను మార్చుకుంటుందని.. ఆ తర్వాత ఏపీ తీరం వెంబడి బలమైన ఈదురు గాలులతో పయనిస్తుందని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.. ముఖ్యంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలకు ఛాన్స్ వుంది.