గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల ఉదయం.. మరికొన్ని చోట్ల సాయంత్రం ఆకాశానికి చిల్లుపడినట్లు వర్షం కురిసింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మాత్రం రాత్రి వేళ వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. నగరంలో కుండపోత వర్షం కురిసింది. దీంతో హైదరాబాద్ రోడ్లను వరద నీరు ముంచెత్తింది. డ్రైనేజీలు పొంగిపోర్లాయి. వర్షపునీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో దాదాపు అరగంటకు పైగా వాన దంచికొట్టింది. దీంతో నగరం మరోసారి జలమయం అయింది. రోడ్లపై వరద నీరు పోటెత్తింది.
Also Read : PM Modi’s Roadshow: కర్ణాటక రోడ్ షోలో ప్రధాని పైకి మొబైల్ ఫోన్ విసిరిన మహిళ..
మోకాలి లోతు నీటి ప్రవాహం కొనసాగడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత నెల ఏప్రిల్ 25, 29 తేదీల్లో కురిసిన కుండపోత వానల నుంచి ఇంకా తేరుకోకముందే ఆదివారం రాత్రి భారీ వర్షం హడలెత్తించింది. నగరంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం పొడిగానే ఉన్నప్పటికీ రాత్రి 7 గంటల తర్వాత మబ్బులు కమ్ముకుని భారీ వర్షం పడింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ట్రాఫిక్ స్థంభించింది. ఈదురు గాలులకు చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, బంజారహిల్స్, షేక్ పేట్,టోలీచౌకీలో చెట్లు కూలాయి. సికింద్రబాద్, హయత్ నగర్, శేరిలింగంపల్లి, కుత్భల్లాపూర్ లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
Also Read : Monday Bhakthi Tv Lord Shiva Pooja: సోమవారం ఈ పూజలు చేస్తే సకల పాపాల నుంచి విముక్తి
నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షం ఇవాళ ఉదయం వరకు కురుస్తునే ఉంది. భారీ వర్షం ధాటికి కొన్ని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలో విద్యాత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కారణంగా వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ స్థంభించింది. ఈదురుగాలుల కారణంగా పలు కాలనీలు, బస్తీలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షంతో జీహెచ్ఎంసీ అప్రమత్తం అయింది. బల్దియా టీమ్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. నగర ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని బయటకి రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరించింది.
Also Read : Kishan Reddy : ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్ లో పలు చోట్ల భారీవర్షం కురిసింది. పలు పాంత్రాల్లో నమోదైన వర్షపాతం. షేక్ పేటలో 10.6 సెం.మీ, ఖాజగూడ లో 9.6 సెం.మీ, రామంతపూర్ లో 8.1 సెం.మీ, మల్కాజిగిరి ఈస్ట్ ఆనంద్ బాగ్ లో 8.1 సెం.మీ, శ్రీనగర్ కాలనీ 8 సెం.మీ, మాదాపూర్ 7.3 సెం.మీ, తార్నాక లో 7.1 సెం.మీ, జూబ్లీహిల్స్ 6.9 సెం.మీ, మైత్రివనం 6.9సెం.మీ, బంజారాహిల్స్ 6.9 సెంటి మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.