Delhi Floods: బీజేపీ కుట్రల వల్లే ఢిల్లీలో వరదలొచ్చాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తరభారతదేశం అతలాకుతలం అవుతుంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలు వరద ప్రవాహానికి మునిగిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఈ వర్షాల కారణంగా యమునా నదిలో నీటిమట్టం రికార్డు స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం వరద ప్రవాహం కొంత తగ్గుముఖం పట్టింది. అయితే ఢిల్లీలో వరదలు రావడం వెనుక భారతీయ జనతా పార్టీ కుట్ర ఉందని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు చేస్తుంది. బీజేపీ పేరు ఎత్తకుండా హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి దేశ రాజధానికి అదనపు నీటిని విడుదల చేయడం వల్ల ఢిల్లీని ముంచేసే కుట్ర జరిగిందని ఆప్ సర్కార్ ఆరోపించింది.
Also Read
- Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Dharmana Prasada Rao: స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏం చేస్తారో చూపించండి.. ధర్మాన సవాల్
వరద పరిస్థితి నగరాన్ని ముంచేసే కుట్ర జరుగుతుందని ఢిల్లీ నీటిపారుదల, వరద నియంత్రణ మంత్రి సౌరభ్ భరద్వాజ్ అన్నారు. ఢిల్లీని ఉద్దేశపూర్వకంగానే ముంచుతున్నారు.. హత్నికుండ్ బ్యారేజీ నుంచి అదనపు నీటిని ఢిల్లీ వైపుకు మళ్లించారు.. సుప్రీంకోర్టుతో సహా ఢిల్లీలోని అన్ని ముఖ్యమైన సంస్థలను ముంచడానికి కుట్ర జరిగిందని అన్నాడు. బ్యారేజీ నుంచి అదనపు నీటిని హర్యానాలోని పశ్చిమ కాలువకు, ఉత్తరప్రదేశ్‌లోని తూర్పు కాలువకు విడుదల చేయడం లేదని ఢిల్లీ నీటిపారుదల మంత్రి పేర్కొన్నారు.
Read Also: Krithi Shetty : మత్తెక్కించే చూపులతో రెచ్చగొడుతున్న కృతి శెట్టి..
యమునా నదిలో నీరు తగ్గుముఖం పడుతుంది. మరో 12 గంటల్లో ఢిల్లీ ప్రజలకు ఉపశమనం లభించనుంది. హత్నీకుండ్ బ్యారేజీ నుంచి మొత్తం నీటిని కావాలనే ఢిల్లీ వైపుకి విడుదల చేశారని ఆప్ సర్కార్ ఆరోపిస్తుంది. మరో వైపుకు ఒక్క చుక్క నీటిని కూడా విడుదల చేయలేదు.. అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్, హర్యానాకు కాల్వలు వెళ్తున్నాయి. దీనికి హర్యానా ప్రభుత్వం సమాధానం చెప్పాలి.. ఇలా చేయడం వల్ల ఢిల్లీలో వరద పరిస్థితిని ఎలా నివారించగలం? అని మంత్రి సౌరభ్ అన్నారు.
Read Also: Dakshin Ke Badrinath: హైదరాబాద్‌లో కొలువైన బద్రీనాథుడు.. ఈ ఆధ్యాత్మిక ప్రదేశం గురించి మీకు తెలుసా?
ఢిల్లీకి వరదను బీజేపీ తెచ్చిన విపత్తని ఆప్ నాయకుడు సోమనాథ్ భారతి అన్నారు. కాగా, ఆప్ ఆరోపణలపై బీజేపీ గట్టిగానే బదులు ఇస్తోంది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో చేసినట్లుగా, వరదల నుంచి ఆప్ తప్పించుకోవాలని చూస్తోందని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా అన్నారు. నీటిని విడుదల చేసినప్పుడు మొదట ఢిల్లీ, ఆగ్రా, అలహాబాద్ గుండా వెళ్లి.. అనంతరం సముద్రంలో కలుస్తుందని హర్యానా వ్యవసాయ మంత్రి జై ప్రకాష్ దలాల్ అన్నారు. నగరంలో చాలా ప్రాంతాలు నీటమునిగి పోవడానికి మూలకారణం అక్రమ ఆస్తులు, ముంపు ప్రాంతాలలో నిర్మాణాలేనని ఆయన విమర్శించారు.
తాజావార్తలు
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
-
Ayushmann Khurrana : మళ్లీ గాడి తప్పుతోన్న ఆయుష్మాన్ ఖురానా సక్సెస్
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
ట్రెండింగ్
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్‌ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?