Heavy Rains: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తున్నాయి.. నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో.. కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు.. మరికొన్ని చోట్ల చిరు జల్లులు పడుతున్నాయి.. అయితే, మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.. నిన్నటి ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం ఈరోజు ఉత్తర అంతర్గత ఒడిశా, దక్షిణ జార్ఖండ్ మరియు ఉత్తర చత్తీఘడ్‌లో కొనసాగుతూ దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఈ అల్పపీడనం రానున్న రెండు రోజుల్లో ఉత్తర మధ్య ప్రదేశ్ వైపు వెళ్లే అవకాశముంది. ఇక, ఆంధ్ర ప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపో ఆవరణములో పడమటి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో.. వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
రాబోవు మూడు రోజులకు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో వాతావరణ పరిస్థితులను తీసుకుంటే.. ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30-40కి.మీ. వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. ఇక, రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని.. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని.. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముందని పేర్కొంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉండగా.. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇక, ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
మరోవైపు రాయలసీమలో ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. ఇక, ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు.