అగ్నేయ బంగాళఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో విపత్తుల శాఖ కమిషనర్ ఏపీకి పలు సూచనలు జారీ చేశారు. అల్పపీడనం కారణంగా ఎల్లుండి దక్షిణ కోసా, ఉత్తర తమిళనాడు తీరాలకు చేరుకునే అవకాశం ఉందని, తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రేపు కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. రేపు రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయన్నారు.…
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందలు ఎదుర్కొంటున్నారు. తిరుపతిలో వర్షాలు బీభత్సానికి భారీ వృక్షాలు నెలకొరిగాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వానలు భారీ కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గూడూరు, పంబలేరు వాగుకు భారీగా వర్షపు నీరు వచ్చిచేరుతోంది. ఈ క్రమంలో జాతీయ రహదారి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. విజయవాడ-చైన్నై జాతీయ రహదారిపై రాకపోకలకు కూడా నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా భారీ వర్షాల కారణంగా స్వర్ణముఖి బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.…
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 36 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి 11 న ఉత్తర తమిళనాడు తీరానికి చేయకునే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి 40,60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. 7 నుండి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కృష్ణ, గుంటూరు, ప్రకాశం,నెల్లూరు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే…
ఏపీకి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నిన్నటి ఉపరితల ఆవర్తనం ప్రస్తుతము ఉత్తర బంగాళాఖాతం & దానిని ఆనుకుని వున్న తూర్పు మధ్య బంగాళాఖాతం లలో సగటు సముద్ర మట్టం నుండి 4.5 కి మీ వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్ళే కొలది నైఋతి దిశ వైపుకు వంగి కొనసాగుతున్నది. దీని ప్రభావం వలన రాగల 24 గంటలలో ఉత్తర & దానిని ఆనుకుని వున్న మధ్య బంగళాఖాతం…