బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 36 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి 11 న ఉత్తర తమిళనాడు తీరానికి చేయకునే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి 40,60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు.
7 నుండి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కృష్ణ, గుంటూరు, ప్రకాశం,నెల్లూరు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. సముద్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.