Musi River : వికారాబాద్ జిల్లాలో మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నది. శంకర్‌పల్లిలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచాయి. టంగుటూరు-మోకిల రోడ్డును సురక్షత కారణంగా అధికారులు మూసివేశారు. అలాగే, అంబర్‌పేట-ముసారంబాగ్ బ్రిడ్జీ పై రాకపోకలు నిలిపివేయడం జరిగింది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉస్మాన్‌సాగర్ నది నిండిపోయింది. ఆ కారణంగా ఉస్మాన్‌సాగర్ నుంచి దిగువ ప్రాంతాలకు నీరు విడుదల చేస్తున్నారు. అంబర్‌పేట ముసారంబాగ్ బ్రిడ్జీ పై వరద నీరు క్రమంగా పెరుగుతోంది. ప్రజల భద్రత కోసం బ్రిడ్జీపై బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వాహనాలను గోల్నాక కొత్త బ్రిడ్జీ ద్వారా మళ్లిస్తూ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు. వికరాబాద్ జిల్లాలోని ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేసి, వరద ప్రబలించిన ప్రాంతాలలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Bathukamma Festival: 9 రోజుల బతుకమ్మ పండుగ.. ఇక్కడ మాత్రం 7 రోజులే.. !