Chennai: తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది. మరో 24 గంటల పాటు ఇదే స్థాయిలో వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఎగువ ప్రాంతాల నుంచి గండిపేట జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే గండిపేట జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. దీంతో ఈ జలాశయం ఆరు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు గ్రామానికి వరద తాకిడి ఎక్కువైంది, చింతూరు వద్ద శభరి నది ప్రమాదకరస్థాయిలో 45 అడుగులతో ఉరకలు వేస్తుండగా, కూనవరం వద్ద శబరి 38 అడుగులకు పెరిగింది. చింతూరు మెయిన్ సెంటర్‌లోకి వరద నీటి ప్రవాహం చేరడంతో ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.
ఏలూరు జిల్లాలోని కొల్లేరులోకి వరద నీరు భారీగా పెరిగింది. వరద ప్రభావంతో కొవ్వాలంక, పెనుమాకులంక, నందిగామ లంక, మణుగూరు గ్రామాలు నీట మునిగాయి. మునిగిన గ్రామాలకు వెళ్లి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రజల బాగోగులను తెలుసుకుంటున్నారు. కొల్లేరుకు పెరిగిన వరద ఉధృతి కారణంగా ముంపు గ్రామాల ప్రజలను అధికా
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎస్బీఐ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, ఎస్బీఐ సీజీఎం రాజేష్ కుమార్, డీజీఎంజితేందర్ శర్మ , ఏజీఎం దుర్గా ప్రసాద్, తనుజ్‌లు పాల్గొన్నారు. వరదల నేపథ్యంలో తెలంగాణ ఎస్బీఐ ఉద్యోగుల ఒకరోజు వేతనం రూ.5కోట్
వరద సహాయ చర్యల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి సహకారం అందిస్తోంది అని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. జాతీయ విపత్తుగా ప్రకటించడానికి కొన్ని నియమ నిబంధనలు వుంటాయి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుకుంటాయి అని ఆమె తెలిపారు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను ఈ వారాంతంలోగా సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టం అంచనా వేయడంపై సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలతో సీఎస్ సమీక్షా సమావేశ