Aurobindo Pharma: తెలంగాణలో వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధికి అరబిందో ఫార్మా రూ.5కోట్లు విరాళంగా అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం, డిప్యూటీ సీఎంలకు అరబిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్&ఎండీ కె.నిత్యానంద రెడ్డి, కంపెనీ డైరెక్టర్ మదన్ మోహన్ రెడ్డి, తదితరులు రూ. 5 కోట్ల చెక్కును అందజేశారు.
Read Also: SBI Donations: సీఎం సహాయనిధికి ఎస్‌బీఐ ఉద్యోగుల ఒకరోజు వేతనం విరాళం
తెలంగాణలో గత వారం రోజులుగా కుండపోత వర్షాలు విలయతాండవం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. తెలంగాణలోని ఖమ్మం జిల్లాను వరద ముంచెత్తింది. ఈ నేపథ్యంలో వరద బాధితుల కోసం ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ఇంకా పరిస్థితులు పూర్తిగా సర్దుకోలేదు. ఇదిలా ఉండగా.. పలు రంగాల్లోని ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, ఉద్యోగులు ప్రభుత్వానికి విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా ఈ రోజు ఎస్బీఐ ఉద్యోగులు, అరబిందో ఫార్మా యాజమాన్యం రూ.5 కోట్ల చొప్పున విరాళాలు అందించారు.
ముఖ్యమంత్రి సహాయనిధికి ఏఐజీ హాస్పిటల్స్ యాజమాన్యం కోటి రూపాయలను విరాళంగా అందించింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి, తదితరులు చెక్కును అందజేశారు.