SBI Donations: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎస్బీఐ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, ఎస్బీఐ సీజీఎం రాజేష్ కుమార్, డీజీఎంజితేందర్ శర్మ , ఏజీఎం దుర్గా ప్రసాద్, తనుజ్‌లు పాల్గొన్నారు. వరదల నేపథ్యంలో తెలంగాణ ఎస్బీఐ ఉద్యోగుల ఒకరోజు వేతనం రూ.5కోట్లు సీఎం సహాయనిధికి ఎస్బీఐ ప్రతినిధులు విరాళంగా అందించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు ఎస్బీఐ సీజీఎం రాజేష్ కుమార్ చెక్కును అందజేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ వరదల కారణంగా ఎంతో మంది బాధితులు భిక్కుభిక్కుమంటూ గడుపుతున్నారు. బాధితుల సహాయార్థం పలువురు విరాళాలు అందిస్తూ తోడుగా నిలుస్తున్నారు. బాధితులకు తోడుగా నిలుస్తున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: GHMC: మట్టి గణపతులను పూజిద్దాం.. జీహెచ్‌ఎంసీ ద్వారా 3.10 లక్షల విగ్రహాల పంపిణీ