రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో 117 గ్రామాలలో 67 వేల మంది భారీ వర్షాలు, వరదల వల్ల ప్రభావితమయ్యాయని మంత్రి చెప్పారు.
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం వాయిదా వేసుకున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. దురదృష్టవశాత్తూ కొందరు ప్రాణాలు కోల్పోయారని.. రాష్ట్రంలో వర్ష పరిస్థితులపై మోడీ, అమిత్ షా రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడారని వెల్లడించారు. కేంద్రం ఎన్డీఆర్‌ఎఫ్ బ�
వరద ప్రమాద ప్రాంతాలు, ప్రమాదానికి కారణాలు, వాటిని ఎదుర్కొన్న తీరుపై బ్లూబుక్‌ను తయారు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. వాటిని కలెక్టరేట్లలో ఉంచాలన్నారు. మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కలతో కలిసి సమీ
రేపు కూడా తెలంగాణలోని దాదాపు 11 జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. రానున్న 24 గంటలలో భారీ వర్షాలు కురిసే హెచ్చరికలున్న 11 జిల్లాలైన ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమరంభీం
కృష్ణానది వరద 12 లక్షల క్యూసెక్కులు చేరుతుందనే అంచనా నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా వాసుల్లో ఆందోళన మొదలైంది.. ప్రకాశం బ్యారేజ్ దిగువున ఉన్న విజయవాడ సిటీ, పెనమలూరు, పామర్రు, అవనిగడ్డలకు ముప్పు వంచిఉన్న నేపథ్యంలో.. పెరుగుతున్న వరద దెబ్బకి వణికిపోతున్నారు జిల్లా వాసులు.
సూర్యాపేట జిల్లాలో వరద పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అధికారుల నివేదిక ప్రకారం 30 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైందని వెల్లడించారు. ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరిగిందని.. ప్రజలకు విశ్వాసం కలిగించేందుకే తన పర్యటన అంటూ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రాథమికంగా నష్టాన్ని అంచనా వేశారని, ని�
తెలంగాణ వ్యాప్తంగా రెండు వేల మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. ఖమ్మం, కోదాడ, సూర్యాపేట ,మహబూబాబాద్‌లో రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించినట్లు ఫైర్ డీజీ నాగిరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం, మహబూబాబాద్, కోదాడలో చాలామందిని ఫైర్ సిబ్బంది రక్షించినట్లు తెలిపారు.
భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (TGDRF) ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. 25 పెద్ద టవర్లు కూలిపోయినప్పటికీ విద్యుత్తు సిబ్బంది వెంటనే కరెంట్ సరఫరాను పునరుద్ధరించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
ఏపీలో భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించి రేపు ( సోమవారం ) విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని ఎడ్యూకేషన్ డిపార్ట్మెంట్ అధికారులను ఆదేశించారు.
AP Govt: వర్షాకాలం కావడంతో అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలోని ఏజెన్సీ నియోజకవర్గంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో గిరిజన ప్రాంతాల్లో వాగులు దాటి రావాల్సిన చోట నెలలు నిండిన గర్భిణీ స్త్రీలను ముందుగా గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించాలని ఆంధ్ర ప్రదేశ్ ర�