China Issues Drought Alert: డ్రాగన్ కంట్రీ చైనా కరువు కోరల్లో చిక్కుకున్నట్లే కనిపిస్తోంది. ఈ ఏడాది చైనా వ్యాప్తంగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా సిచువాన్ ప్రావిన్స్ తో పాటు నైరుతి చైనాలోని చాలా కౌంటీలు ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్నాయి. దీంతో చైనా మొదటి జాతీయ కరువు హెచ్చరికను జారీ చేసింది. దేశవ్యాప్తంగా ‘‘ ఎల్లో అలర్ట్ ’’ జారీ చేసింది. నైరుతిలోని సిచువాన్ ప్రావిన్స్ నుంచి యాంగ్జీ నది డెల్టాలోని షాంఘై నగరం…