పురుషులతో పోలిస్తే మహిళలకు గుండె జబ్బుల ముప్పు కొంత తక్కువగా ఉంటుందని చాలామందికి తెలియదు. ముఖ్యంగా మెనోపాజ్ వరకు మహిళల శరీరంలో ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్ గుండెను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ హార్మోన్ రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచి, చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల యువ వయస్సులో మహిళలకు గుండె సంబంధిత సమస్యలు తక్కువగా కనిపిస్తాయి. అయితే మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయి గణనీయంగా తగ్గిపోవడంతో…