సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు డాక్టర్ బిందేశ్వర్ పాఠక్ మంగళవారం (ఆగస్టు 15) కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు.
Young Man dies with Heart Attack While Playing Cricket in Nandyala: దేశంలో గుండెపోటుతో ఆకస్మిక మరణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటుతో అనధికారికంగా వందలాది మంది మృతి చెందారు. నిత్యం ఎక్కడో ఒక చోట ఇలాంటి వార్త వినాల్సి వస్తోంది. యువకులు కూడా గుండెపోటుతో చనిపోతుండడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలోని ఓ యువకుడు స్నేహితులతో క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు.…
ప్రస్తుత కాలంలో చాలా మంది చిన్నవయసులోనే గుండెపోటుతో మరణిస్తున్నారు. అయితే ఇలా మరణించేవారిలో చాలా మంది గుండెపోటుకు ముందు కనిపించే కొన్ని లక్షణాలను గుర్తించలేకపోతున్నారు. ప్రధానంగా వారు గుండెపోటుకు, గ్యాస్ నొప్పికి మధ్య ఉన్న తేడాను గమనించలేకపోతున్నారు. మారిన జీవన విధానం వల్ల చాలా మందికి గ్యాస్, అజీర్తిలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. అయితే కొన్ని సార్లు ఈ నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇది నార్మల్ నొప్పే అనుకొని చాలా మంది పట్టించుకోవడం లేదు. ఇలాంటి నొప్పి కొన్నిసార్లు…
Heart Attack: ఆకస్మిక గుండెపోటు మరణాలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి. చిన్నతనం నుంచి మధ్య వయసు వరకు చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. అకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరుకుని ప్రాణాలు విడిచాడు.
చాలా మంది యువత ఉపాధి కోసమనో.. లేదంటే చదువుల కోసమనో విదేశాలకు వెళ్తుంటారు. తమ పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు కూడా వారిని విదేశాలకు పంపించడంలో వెనుకాడటం లేదు. లక్షలు లక్షలు ఖర్చు చేసి మరీ పంపిస్తున్నారు. అయితే గత కొద్దిరోజులుగా విదేశాలకు వెళ్లిన పంజాబ్ రాష్ట్రానికి చెందిన యువత గుండె జబ్బుల బారిన పడుతున్నారు.
కొవిడ్ తర్వాత యువకుల్లో గుండె ఆగిపోవడం వల్ల ఆకస్మిక మరణాలు నమోదయ్యాయి. అయితే కారణాన్ని నిర్ధారించడానికి తగిన ఆధారాలు అందుబాటులో లేవని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య ఈరోజు పార్లమెంటుకు తెలిపారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న బూపల్లి స్పందనను చూడడానికి వచ్చిన తండ్రి బూపల్లి విజయ్ కు గుండె పోటు రావడంతో హాస్పిటల్ తరలిస్తుండగా రైల్వే గేట్ పడింది. దీంతో అంబులెన్స్ లోనే గుండె నొప్పి భరించలేక అతడు విలవిలవిల్లాడిపోయాడు. అంబులెన్స్ సిబ్బంది సీపీఆర్ చేస్తూ అతడిని కాపాడేందుకు ట్రై చేశారు. కానీ రైలు వెళ్లిపోయి గేటు ఎత్తే సమయానికి అతడి పరిస్థితి పూర్తిగా విషమించడంతో చనిపోయాడు.
హార్ట్ ఎటాక్ ఇప్పుడు అందరిని భయపెడుతున్న పెద్ద సమస్య. హార్ట్ ఎటాక్‌కు వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తున్న పలు ఘటనలు చూస్తున్నాం. చివరికి పాతికేళ్లు నిండని యువతలో కూడా గుండెపోటు వస్తుంది.
Covid Vaccine: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) గుండెపోటు కేసుల ఆకస్మిక పెరుగుదలకు, కోవిడ్-19 వ్యాక్సిన్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడానికి ఒక అధ్యయనం నిర్వహించింది. మీడియా నివేదికల ప్రకారం.. గుండెపోటు,కోవిడ్ వ్యాక్సిన్ల కనెక్షన్‌కి సంబంధించిన అధ్యయనాన్ని రాబోయే రెండు వారాల్లో విడుదల చేయవచ్చు.