ప్రస్తుత కాలంలో చాలా మంది చిన్నవయసులోనే గుండెపోటుతో మరణిస్తున్నారు. అయితే ఇలా మరణించేవారిలో చాలా మంది గుండెపోటుకు ముందు కనిపించే కొన్ని లక్షణాలను గుర్తించలేకపోతున్నారు. ప్రధానంగా వారు గుండెపోటుకు, గ్యాస్ నొప్పికి మధ్య ఉన్న తేడాను గమనించలేకపోతున్నారు. మారిన జీవన విధానం వల్ల చాలా మందికి గ్యాస్, అజీర్తిలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. అయితే కొన్ని సార్లు ఈ నొప్పి ఎక్కువగా ఉంటుంది.
ఇది నార్మల్ నొప్పే అనుకొని చాలా మంది పట్టించుకోవడం లేదు. ఇలాంటి నొప్పి కొన్నిసార్లు గుండెపోటుకు కూడా సంకేతం కావచ్చు. గుండెపోటుకు ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఛాతి మధ్యలో నొప్పి ఎక్కువగా వస్తుంది. కొంతమందికి భుజాల నుంచి తల వరకు నొప్పి వస్తుంది. మరికొంత మందిలో తేన్పులు, ఆవలింతలు, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
Also Read: Health News: జర్వం వచ్చినప్పుడు బాలింతలు పిల్లలకు పాలు ఇవ్వొచ్చా?
చాలా మంది ఇటువంటి సంకేతాలు కనిపించినా గ్యాస్ నొప్పి అనుకుంటూ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. వీటి తీవ్రత ఎక్కువైతే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా కాఫీ, కూల్ డ్రింక్స్ వల్ల కూడా గుండెనొప్పులు వచ్చే ప్రమాదం ఉందని అందుకే వాటిని తీసుకోవడం తగ్గించాలని హెచ్చరిస్తున్నారు.