Heart Attack: ప్రస్తుతం టెక్ రంగంలో AI(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పేరు మార్మోగుతోంది. రానున్న కాలంలో మానవ జీవితాన్ని ఏఐ మరింత సులభతరం చేస్తుందని టెక్ సంస్థలు చెబుతున్నాయి. ఇదే విధంగా ఏఐ మానవుడి ఉనికికి ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. వైద్య పరిశోధనతో సహా వివిధ రంగాల్లో గణనీయమైన పురోగతని సాధించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడునుంది. పెద్ద డేటా సెట్‌లను విశ్లేషించడానికి, నమూనాలను గుర్తించడానికి, అంచనాలు రూపొందించడానికి AI…
విజయవాడలో ప్రముఖ హృద్రోగ వైద్య నిపుణుడు గుండెపోటుతో మృతి చెందారు. రమేష్ కార్డియాక్ హాస్పటల్స్‌లో సుదీర్ఘ కాలంగా కార్డియాలజీ సర్జన్‌గా పేరొందిన డాక్టర్ పాటిమళ్ల శ్రీనివాస ప్రసాద్ మంగళవారం రాత్రి అనూహ్యంగా సైలెంట్ కార్డియాక్ అరెస్ట్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
Smartwatch Saves Life: టెక్నాలజీని సరైన విధంగా ఉపయోగిస్తే మానవాళికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. మరోవైపు సక్రమంగా వినియోగించకుంటే ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. అయితే టెక్నాలజీ ఓ వ్యక్తి ప్రాణాలను నిలబెట్టింది. గుండె పోటుతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని స్మార్ట్‌వాచ్ కాపాడిన ఘటన యూకేలో జరిగింది.
Heart Attack: ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. కొన్నాళ్ల క్రితం కేవలం వయసు పైబడిన వారికి మాత్రమే గుండెపోటు వస్తుందని అంతా అనుకునే వాళ్లం. కానీ ఇప్పడు స్కూల్ పిల్లల నుంచి టీనేజ్ వయసు వారికి, 30 ఏళ్ల లోపువారు కూడా గుండె పోటుకు గురై ప్రాణాలు వదులుతున్నారు. అంతవరకు సంతోషంగా పెళ్లిలోనో, ఇతర శుభకార్యాల్లో నవ్వుతూ డ్యాన్సులు చేస్తున్న వారు హఠాత్తుగా హార్ట్ ఎటాక్ కారణంగా విగతజీవులవుతున్నారు.
భారతదేశంలో వేగంగా పెరుగుతున్న గుండెపోటు కేసులు కరోనా మహమ్మారికి సంబంధించినదా? అనే ప్రశ్న నేడు అందరి మదిలో మెదులుతోంది. అవును ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గుండెపోటుకు అసలు కారణం, దానిని నివారించడానికి మార్గాలను చెప్పారు.
Garba events: నవరాత్రుల సందర్భంగా గుజరాత్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో గర్భా డ్యాన్స్ కార్యక్రమాలు అట్టహాసంగా జరుగాయి. గర్బా నృత్య వేడుకల్లో చిన్నా పెద్దా, యువతీయువకులు పాల్గొంటున్నారు. అయితే ఈ వేడుకల్లో పాల్గొంటున్న కొందరు గుండెపోటుతో కుప్పకూలుతున్నారు. గర్బా వేడకలు ఆయా కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. అప్పటి వరకు తమ ముందు ఆనందంగా, నవ్వుతూ డ్యాన్స్ చేసిన వ్యక్తులు గుండె పోటుతో మరణించడం చాలా మందిని కలిచివేస్తోంది.
నానబెట్టిన వేరుశెనగలు తినడం ద్వారా మానవుని ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కొందరు ఉదయాన్నే నానబెట్టిన గింజలు, మొలకలు తింటారు. అవి తినడం వల్ల ఎన్నో ప్రోటీన్లు లభిస్తాయి. వీటిలో మన శరీరానికి మేలు చేసే లిపిడ్లు, ఫాస్పరస్, ప్రొటీన్లు, విటమిన్లు, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉన్నందున వీటిని ఆరోగ్యకరమైన స్నాక్స్‌గా పరిగణిస్తారు.
మనిషికి తిండి, నీళ్లు ఎలాగో నిద్ర కూడా అంతే.. ఈ మూడు లేకుండా మనిషి ఉండలేడు.. మారిన వాతావరణం, ఆహారపు అలవాట్ల కారణంగా నిద్ర లేమి సమస్య ఎక్కువగా వస్తుంది.. మనిషి సగటున 7 లేదా 8 ఖచ్చితంగా నిద్రపోవాలి.. ఈరోజుల్లో ఎక్కువ మంది ఆరు గంటల కన్నా తక్కువగా నిద్రపోతున్నారు.. రోజూ 6 గంటల కంటే తక్కువగా నిద్రపోవడం వల్ల గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి కారణంగా మనం చాలా…