Heart Attack: ఆకస్మిక గుండెపోటు మరణాలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి. చిన్నతనం నుంచి మధ్య వయసు వరకు చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. అకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరుకుని ప్రాణాలు విడిచాడు. మృతుల్లో చిన్నారుల నుంచి మధ్య వయస్కుల వరకు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అప్పటి వరకు తోటి విద్యార్థులతో ఆడుకుంటున్న చిన్నారులు గుండెపోటుకు గురై క్షణాల్లో మృత్యువాత పడ్డారు. వయసుతో నిమిత్తం లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మారిన ఆహారపు అలవాట్లు, కలుషిత ఆహారం, సమయపాలన లోపం, పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, ఇతర ఆరోగ్య సమస్యలే గుండెపోటుకు ప్రధాన కారణమని పలువురు వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. శారీరక శ్రమ లేకపోవడంతో పాటు రోజువారీ జీవితంలో మానసిక ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక సమస్యలు, కిడ్నీ సమస్యలు, గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే ఓ ఇంటర్ విద్యార్థిని ఫ్రెషర్స్ డే రోజు డ్యాన్స్ ఆడుతూ గుండెపోటు రావడంతో కుప్పకూలి మృతి చెందిన ఘటన కరీంనగర్ లో చోటుచేసుకుంది.
Read also: Health Tips: కరివేపాకును ఇలా వాడితే అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా?
కరీంనగర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని కళాశాలలో జరుగుతున్న ఓ కార్యక్రమంలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలింది. వివరాల్లోకి వెళితే జిల్లాలోని గంగాధర మండలం వెంకటాయపల్లికి చెందిన గుండు అంజయ్య, శారదల కుమార్తె ప్రదీప్తి ఆదర్శ పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఆమెకు చిన్నప్పటి నుంచి గుండెలో రంధ్రం ఉండేది. వైద్యులు ఆపరేషన్ చేయాలని తల్లిదండ్రులకు సూచించినప్పటికీ వారు భరించలేకపోయారు. కాగా, శుక్రవారం కళాశాలలో ఫ్రెషర్స్ డే నిర్వహించారు. ఈ క్రమంలో ప్రదీప్తి తన తోటి విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. కళాశాల వైద్యులు ఆమెకు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోవడంతో వెంటనే కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మొదటి బిడ్డను పోగొట్టుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Whatsapp Screen Sharing: వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. మీ స్క్రీన్‌ను ఇతరులతో షేర్