CDSCO: మరోమారు నాణ్యత పరీక్షలలో విఫలమైన 135 రకాల మందులు..
- సేకరించిన మందుల నమూనాల పరీక్షా ఫలితాలను విడుదల చేసిన కేంద్ర ఔషధ ప్రమాణ నియంత్రణ సంస్థ (CDSCO).
- నాణ్యత పరీక్షలలో విఫలమైన 135 రకాల మందులు.
- గుండె, షుగర్, కిడ్నీ, రక్తపోటు, యాంటీబయాటిక్స్ వంటి వివిధ వ్యాధులకు వాడే మందులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CDSCO: కేంద్ర ఔషధ ప్రమాణ నియంత్రణ సంస్థ (CDSCO) డిసెంబర్ నెలలో సేకరించిన మందుల నమూనాల పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. నివేదిక ప్రకారం, 135 మందులు నాణ్యతా ప్రమాణాలను అందుకోలేకపోయాయి. ఈ మందులలో గుండె, షుగర్, కిడ్నీ, రక్తపోటు, యాంటీబయాటిక్స్ వంటి వివిధ వ్యాధులకు వాడే మందులు ఉన్నాయి. గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో మందుల తయారీ కంపెనీలపై దృష్టి పెడుతున్నారు. ఈ మందులలో ప్రధానంగా షుగర్, మైగ్రేన్ వంటి వ్యాధులకు ఉపయోగించే ఔషధాలు ఉన్నాయి. కేంద్ర ప్రయోగశాలలు 51 మందుల నమూనాలను, రాష్ట్ర ఔషధ పరీక్షా ప్రయోగశాలలు 84 మందుల నమూనాలను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని నిర్ధారించాయి. ఈ నిర్ధారణ తరువాత కొన్ని మందుల తయారీదారుల లైసెన్స్‌లను రద్దు చేసే ప్రక్రియ ప్రారంభమైంది.
Also Read: Inter University Games: మహిళా కబడ్డీ ఆటగాళ్లపై దాడి
Also Read
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
- Nepal Floods: నేపాల్‌లో భారీ వరదలు.. 16 మంది హైదరాబాద్ ఎన్ఆర్ఐలు గల్లంతు..!
- 50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
ప్రధానంగా తక్కువ నాణ్యత గల మందులలో జన్ ఔషధ కేంద్రాలకు సరఫరా చేసే యాంటీబయాటిక్ సెఫ్పోడోక్సైమ్ టాబ్లెట్ (200 ఎంజీ), డైవల్‌ప్రోఎక్స్ ఎక్స్టెండెడ్ రిలీజ్ టాబ్లెట్, మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ టాబ్లెట్, జింక్ సల్ఫేట్ టాబ్లెట్, పెంటాప్రజోల్, అమోక్సిసిలిన్, బీటాహిస్టైన్ లు ప్రదానంగా ఉన్నాయి. ఇప్పటివరకు 300 మందులు నిషేధానికి గురయ్యాయి. ఈ మందుల్లో 206 ఫిక్స్ డోస్ మందులు కూడా ఉన్నాయి. ఫిక్స్ డోస్ అంటే ఒకే మందులో రెండు లేదా ఎక్కువ మందులను కలిపి తయారు చేసే ఔషధాలు.
Also Read: Maha Kumbh Mela 2025: కుంభమేళా ప్రాంతంలో మళ్లీ మంటలు.. రెండు వాహనాలు దగ్ధం
మందుల నాణ్యత నిర్ధారించడానికి CDSCO పలు దశల్లో పరీక్షలు నిర్వహిస్తుంది. మొదట మందుల సంబంధించిన డాక్యుమెంట్లు, లేబెలింగ్, ఎక్స్‌పైరీ డేట్లను పరిశీలిస్తారు. ఆపై మందుల భద్రత, ప్రభావాలను అంచనా వేయడానికి ప్రత్యేకమైన సేఫ్టీ పరీక్షలు చేస్తారు. ఇంకా లేబులింగ్ విషయంలో ఎటువంటి తప్పు ఉంటే దానిని సరిదిద్దుతారు.
తాజావార్తలు
-
Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
-
Range Rover Sport Twenty Edition: రేంజ్ రోవర్ స్పోర్ట్ ట్వంటీ లిమిటెడ్ ఎడిషన్ విడుదల.. 537HP పవర్, కొత్త ఆరెంజ్ కలర్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
ISI Spy Trap: పాక్ ISI స్పై ట్రాప్.. ‘నగ్న ఫొటోలు’ ఎరగా వేసి భారత రక్షణ అధికారులను టార్గెట్ చేస్తున్న పాక్ ISI?
-
Hrehaan Roshan: హృతిక్ రోషన్ కొడుకు సింగర్‌గా ఎంట్రీ.. తొలి పాటతోనే అదరగొట్టిన హృహాన్!
ట్రెండింగ్
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్‌లో విప్లవం.!