శరీరంపై ఆదనంగా ఏవైనా అవయవాలు ఉంటే వాటిని ఎలాగైనా సరే తీసేయించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. చూసేవారికి ఇబ్బంది లేకపోయినా, వాటిని మోస్తూ తిరిగేవారికి ఇబ్బందికరంగా ఉంటుంది. చిన్నచిన్న ఇబ్బందులు అంటే సరేలే అనుకోవచ్చు. కానీ, శరీరంపై మోయలేనంతగా అవయవాలు పెరిగిపోతే ఇంకేమైనా ఉందా చెప్పండి. గుజరాత్‌కు చెందిన 56 ఏళ్ల మహిళ పొత్తి కడుపులో ఓ ట్యూమర్ ఏర్పడింది. ఆ ట్యూమర్ క్రమంగా పెరిగిపోతూ వచ్చింది. ఎంతగా పెరిగింది అంటే సుమారు 47 కేజీలు పెరిగింది. కడుపు పెద్దదిగా మారిపోయింది. 18 ఏళ్ల క్రితం నుంచి ఆమె శరీరంలోని పొత్తి కడుపులో ట్యూమర్ ఏర్పడింది.
Read: Godavari-Cauvery: నదుల అనుసంధానం.. ఐదు రాష్ట్రాలతో కీలక భేటీ
అయితే, దానిని ఆమె నిర్లక్ష్యం చేసింది. ఆ తరువాత ఆ ట్యూమర్ క్రమంగా పెరిగిపోతూ మోయలేని భారంగా మారింది. ఇటీవలే అహ్మదాబాద్ కు చెందిన వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి ట్యూమర్‌ను తొలగించారు. గత రెండేళ్లుగా ఈ ట్యూమర్ భారీగా పెరిగిపోయినట్టు ఆమె కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఆపరేషన్ నిర్వహించి కణితిని తీసేయడంతో ఆమె బరువు ఒక్కసారిగా తగ్గిపోయిందని, 49 కేజీల బరువుకు చేరుకుందని వైద్యులు పేర్కొన్నారు. శరీరంఓ ఈ స్థాయిలో కణితి ఏర్పడటం తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని వైద్యులు పేర్కొన్నారు.