కొన్నిసార్లు నయంకాని జబ్బులు విచిత్రంగా అందర్నీ ఆశ్చర్యపరుస్తూ నయం అవుతుంటాయి. వైద్యశాస్త్రానికి అలాంటివి సవాలుగా నిలుస్తుంటాయి. కొన్నిసార్లు చనిపోయిన వ్యక్తులు తిరిగి బతకడం కూడా చూస్తుంటాం. ఇలాంటి సంఘటన ఒకటి స్పెయిన్‌లో జరిగింది. స్పెయిన్‌లోని విల్లాబోనాలోని అస్టురియాస్ సెంట్రల్ పెనిటెన్షియరికీ చెందిన గొంజాలో మోంటోయా జిమెనెజ్ అనే ఖైదీ అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే అతడిని ఓవిడోలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ లీగల్ మెడిసిన్‌కు తరలించారు. ఖైదీని పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆ వ్యక్తి చనిపోయాడని తెలియజేశారు. ఖైదీ చనిపోవడంతో ఆ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు తెలిపారు.
Read: కూతురికోసం చిరుతతో ఫైటింగ్ చేసిన మహిళ…
ఈ తరువాత పోలీసులు ఖైదీ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం చేసేందుకు తరలించారు. పోస్ట్ మార్టం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసి మార్కింగ్ చేశారు. ఇంతలో ఆ ఖైదీ పెద్దగా అరుస్తూ లేచికూర్చున్నాడు. దీంతో వైద్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే వైద్యులు ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఖైదీ ఆరోగ్యం నిలకడగానే ఉందని, అయితే, చనిపోయినట్లు నిర్ధారించిన ఆ వ్యక్తి తిరిగి ఎలా బతికాడు అన్నది మిరాకిల్ అని వైద్యులు చెబుతున్నారు.