ప్రతి ఒక్కరి జీవితంలో ఒత్తిడి సహజం. రోజూ ఆఫిసుల్లోనూ.. ఇంట్లోనూ పలు సందర్భాల్లో ఒత్తిడికి గురవుతుంటాం. ఒత్తిడి మానసిక ఆరోగ్యానికి చాలా హానికరం. శృతి మించితే ఒత్తిడి ప్రమాదమం.. కానీ కొన్ని సందర్భాల్లో ఒత్తిడి కూడా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
వయస్సు పెరుగుతున్న కొద్దీ చర్మం, ముఖంపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖంపై ముడతలు పడటం, చర్మం వదులుగా ఉండటం.. ముఖం మెరుపు కోల్పోవడం వృద్ధాప్యానికి సంబంధించిన స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందు కోసం కెమికల్ అధికంగా ఉండే క్రీములు, బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయితే వీటిల్లో ఉండే రసాయనాలు, నిషేధిత పదార్థాల వల్ల దీర్ఘకాలంలో శరీరంలో అనేక రకాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
మెరిసే చర్మం నుండి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు విటమిన్ ‘సి’ ఆరోగ్యానికి అనేక అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. విటమిన్ సి, ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. శరీరానికి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి.. పెరుగుదల, అభివృద్ధి, శరీర కణజాలం మరమ్మత్తు.. ఇనుము శోషణకు విటమిన్ సి అవసరం. దీని వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగమైనప్పటికీ.. ఎక్కువగా తింటే ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. విటమిన్ సి అధికంగా తీసుకోవడం వల్ల కలిగే కొన్ని…
ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు అనేక రకాల తీవ్రమైన కడుపు సంబంధిత సమస్యలకు గురవుతున్నారు. హెర్నియా కూడా ఆ సమస్యలలో ఒకటి. దీని ప్రమాదం కూడా క్రమక్రమేణా పెరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఇంగువినల్ హెర్నియా అనేది ఒక రకమైన హెర్నియా. దీనివల్ల దిగువ ఉదర కండరాలలో బలహీనత సమస్య ఏర్పడుతుంది. దీనికి శస్త్రచికిత్స అవసరం. అయితే.. హెర్నియా సమస్య ఎవరికైనా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మన దేశపు ఉప్పు, చక్కెరలో మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నట్లు వార్తలు జనాలను టెన్షన్ పెడుతున్నాయి. అయితే.. ఓ స్టడీ ఫలితాల్లో నిజమే అని తేలింది. ఉప్పు, పంచదార కాకుండా.. మన శరీరంలోకి అనేక విధాలుగా మైక్రోప్లాస్టిక్‌లు వెళ్తున్నాయి. దాంతో.. అనేక ప్రధాన వ్యాధులకు గురవుతారు. మనం రోజు తాగే 'టీ' తాగడం వల్ల శరీరంలోకి ప్లాస్టిక్ వెళ్తుంది.
రోజూ యాపిల్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమని పెద్దలు చెబుతుంటారు. యాపిల్స్ తినడం వల్ల మంచి అనే అందరూ చెబుతుంటారు. ఎందుకంటే.. వాటిల్లో ఉండే విటమిన్లు, ఫైబర్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాపర్.. యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అయితే యాపిల్ తింటే కొందరికి మంచిది కాదు. వారు.. యాపిల్స్ ను తినకూడదు.
వినికిడి లోపం లేదా చెవుడు వచ్చే ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. వయసు పెరిగే కొద్దీ చెవి వ్యాధులు రావడం సాధారణమని భావిస్తారు. అయితే ఇటీవలి నివేదికల ప్రకారం.. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రమాదం యువకులలో కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవలి నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, ఇయర్‌బడ్‌లు.. హెడ్‌ఫోన్‌ల వాడకం పెరుగుతున్నందున వినికిడి లోపం.. చెవుడు కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.
దేశంలో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరుగుతోంది. అందులో గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ ఇలాంటి అనేక రకాల వ్యాధులు ఉన్నాయి. ఇవన్నీ అకాల మరణాల ప్రమాదానికి దారి తీస్తాయి. ఈ సమస్యల బారిన యువత కూడా పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. కాగా.. అనేక దీర్ఘకాలిక వ్యాధులను సకాలంలో పరిష్కరించి చికిత్స చేస్తే వాటి కారణాలను తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వర్షాకాలంలో దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. ప్రతి సంవత్సరం డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధుల కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆసుపత్రులలో చేరుతున్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్.. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో సహా అనేక రాష్ట్రాల్లో డెంగ్యూ రోగుల సంఖ్య పెరుగుతుంది. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) డేటా ప్రకారం.. ఈ సంవత్సరం జూన్ 30 వరకు 246 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.